YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కొంపముంచిన ఆత్యాశ

కొంపముంచిన ఆత్యాశ

అనంతపురం ఏప్రిల్ 15 
అత్యాశ వారి కొంప ముంచింది. కాసుల కోసం కక్కుర్తి పడితే నిండా మునిగి పోయారు. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. ఇప్పుడున్న హైటెక్ యుగంలో కూడా అత్యాశ వల్ల లక్షలు పోగొట్టుకుంటున్నారు. కరువు సీమలో వైట్ కాలర్ నేరగాళ్లు ఎక్కువ అయ్యారు. పంటలు పండక నష్టాల్లో కూరుకు పోయిన రైతన్నలు లక్ష కడితే నెలకు 30 వేలు అదనంగా వస్తాయని చెబితే డబ్బులు కట్టి రైతన్నలు నిండా మునిగి పోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల మంది రైతన్నలు సుమారు 300 కోట్లు పోగొట్టుకున్నారు. రైతన్నలు నిండా మునిగిపోయిన ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లాలో ఈబిడ్  కంపెనీ పేరుతో నాగపూర్ చెందిన సునీల్ ఎండీగా  సుధాకర్ నాయుడు మహేందర్ చౌదరి లతో కలిసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 300 కోట్లు నిండా ముంచేశాడు అనంతపురం జిల్లాలో  బ్రాంచిలు  ఓపెన్ చేసి  నెలకి లక్ష కి 40,000 అదనంగా ఇస్తానని నమ్మబలికి రైతుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశారు.2018 నుంచి ఇప్పటివరకు సుమారు జిల్లావ్యాప్తంగా 300 కోట్లు వసూలు చేశారని బాధితుల వాపోయారు.అనంతపురం జిల్లా వ్యాప్తంగా నెల రోజుల నుంచి డబ్బు ఇచ్చిన రైతులు  వారిని నమ్మి డబ్బులు ఇచ్చిన వారు  ఏజెంట్ల ద్వారా  రైతులు నిండా మునిగి పోయారు. .చేసేదేమీలేక నేడు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.వారితో కూలంకుషంగా కేసు విషయమై ఎస్పీ బంగ్లాలో విచారణ చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు తీసుకున్నారు ఎండి సునీల్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రధాన సూత్రధారులు మహేందర్ చౌదరి, సుధాకర్ నాయుడు లు వీరిపై కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నష్టపోయిన రైతులను వారికి సంబంధించిన ఏరియాలో ఫిర్యాదు ఇవ్వాలని వెంటనే కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా వైట్ కాలర్ నేరగాళ్ల ఎక్కువ అవుతున్నారని వారి భరతం పడతామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు..

Related Posts