YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఈదురు గాలులకు నేల రాలిన మామిడి కాయలు

ఈదురు గాలులకు నేల రాలిన మామిడి కాయలు

పత్తికొండ
పత్తికొండ నియోజకవర్గ పరిధిలో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులు రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోంది. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని పత్తికొండ,మద్దికెర,తుగ్గలి,దేవనకొండ మండలాల్లో రైతులు మామిడి,బొప్పాయి, అక్కడక్కడ అరటి పంటలు సాగు చేస్తున్నారు.పంటలు అన్ని చేతికొచ్చే సమయంలో పెను గాలులకు పంటలు నేలరాలాయి.ఈదురు గాలులకు అరటి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి.అక్కడక్కడా కొద్దిపాటి వర్షం కురిసింది.హార్టికల్చర్ అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. 
వివరణ: ఈ విషయమై పత్తికొండ ఉద్యానవనశాఖ అధికారిణి అనూష ను వివరణ కోరగా రైతులు ఆయా గ్రామాల్లోని సచివాలయాలలో ఉన్న ఉద్యానవనశాఖ యంపీఈఓ ను కలిసి,పంటనష్టం వివరాలు నమోదు చేయించుకోవాలని,నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు తెలుపుతామన్నారు.

Related Posts