YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

జగిత్యాల..మామిడి పై కరోనా ప్రభావం

జగిత్యాల..మామిడి పై కరోనా ప్రభావం

కరీంనగర్, ఏప్రిల్ 26,
జగిత్యాల జిల్లా మామిడికి కేరాఫ్‌లా నిలుస్తున్నది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు తరలుతూ, మధురఫలానికి పెట్టింది పేరుగా మారింది. ఫలోంకీ రా జా గా మామిడి ఎంతలా ప్రసిద్ధి చెందిందో.. అంత టి మాధుర్యాన్ని పంచే మధురఫలానికి జగిత్యాల జిల్లా పెట్టిన పేరుగా నిలుస్తున్నది. దేశ, విదేశాల్లో మన ఫలానికి ఎంతో ఆదరణ ఉంది. జిల్లాలో జగిత్యాల, మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌ పరిసరాల్లో దాదాపు సుమారు 40 వేల ఎకరాల్లో తోటలు విస్తరించి ఉండగా, ఏటా ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి మే చివరి దాకా జిల్లాలో మధుర ఫలాల జాతరే కనిపిస్తుంది. ఇక్కడి మార్కెట్లకు 1.40లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి వస్తుండగా, ఇక్కడి నుంచి దేశ నలుమూలలకు వెళ్తుంది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీజన్‌లో 550 కోట్ల వ్యాపారంలో ఒక్క జగిత్యాల నుంచే సుమారు 350 కోట్ల వ్యాపారం జరుగుతున్నదంటే అర్థం చేసుకోవచ్చు.జిల్లాలోని సుమారు 40వేల ఎకరాల తోటల నుంచి ఏటా సీజన్‌లో లక్షా 40వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుండగా, 350కోట్లపైనే వ్యాపారం సాగుతున్నది. అయితే ఇన్నాళ్లూ వేధించిన రవాణా వ్యయభారం, ఇప్పుడు తీరిపోయింది. కిసాన్‌ రైలు రాకతో అతి తక్కువ ఖర్చుతో ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుండగా, సమయం కూడా కలిసివస్తున్నది. కాయ చెడిపోకుండా 24గంటల్లోనే ఢిల్లీ లాంటి ప్రాంతాలకు చేరుతుండగా, వ్యాపారవర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.ఎంతో రుచిగా ఉండే జగిత్యాల మామిడికి దేశంలో చాలా ఆదరణ ఉన్నది. జగిత్యాల మామిడి మార్కెట్‌ ఉత్తర తెలంగాణకు అంతటికీ కేంద్రం. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో మామిడి మార్కెట్లు ఉండగా, వీటిలో మొత్తం 120 నుంచి 150 మందికి మార్కెటింగ్‌ లైసెన్సులు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 80 మంది మాత్రమే మామిడి మార్కెటింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడి మామిడి మండీలో యూపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు చెందినసుమారు 2 వేల మంది లేబర్‌ పనిచేస్తుంటారు. ఇక్కడి నుంచి ఏటా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, కేరళ రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండగా, మొత్తం మామిడి వ్యాపారంలో 50 శాతం ఢిల్లీ మార్కెట్‌కే వెళ్తుంది.కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 70 వేల ఎకరాల వరకు మామిడి తోటలుండగా, జగిత్యాలలోనే ప్రధాన మామిడి మండి ఉన్నది. జగిత్యాలతోపాటు కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుంచి కాయలను వ్యాపారులు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎగుమతి చేస్తుండగా, సీజన్‌లో వేలాది లారీల ద్వారా కాయలు తరలిస్తారు. అయితే లారీలు, భారీ ట్రక్కులు, వ్యాన్లలో కాయలను తీసుకెళ్లినప్పుడు కిలోకు 4.50 నుంచి 6.50దాకా ఖర్చు అవుతుంది. రెండు మూడు రోజుల సమయం తీసుకోవడంతో రవాణాలోనే కాయలు మగ్గి, చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిసాన్‌ రైలు ఈ సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. జగిత్యాలతోపాటు కరీంనగర్‌, పెద్దపెల్లి రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తుంది. కిసాన్‌ రైలు ద్వారా కిలో మామిడి ఢిల్లీకి తరలించేందుకు 2 మాత్రమే చార్జీ చేస్తున్నది. అందులోనూ 24 గంటల్లోనే రాజధానికి రీచ్‌ అవుతున్నారు. అధిక రవాణా వ్యయ భారం కూడా తప్పుతున్నది. సమయం ఆదా అవుతున్నది. కిసాన్‌రైలు రాకతో దేశవ్యాప్తంగా ఎగుమతులకు అవకాశం దొరికింది.కరోనా కారణంగా వ్యాపారులు రాకపోవడం, మార్కెటింగ్‌ సరిగా లేకపోవడంతో ఈ సారి మామిడి ధర పడిపోతున్నదనే చెప్పవచ్చు. గత సీజన్‌లో ఏప్రిల్‌, మే నెలల్లో మామిడి కిలో 45 నుంచి 50 దాకా ఉండగా, ఈ సారి ఈ నెల మొదట్లోనే కిలో మామిడికి 55 నుంచి 60 వెచ్చించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఫైన్‌ రకం మామిడికి 32 నుంచి 36 వరకు, మంగు, తేనెమంచు ఉన్న మామిడికి 25 నుంచి 28 దాకా రైతులకు చెల్లిస్తున్నారు. మే నెల చివరి నాటికి మామిడి ధర 25 వరకు పడిపోయే అవకా శం కనిపిస్తున్నది. జిల్లాలో ఈసారి అకాల వర్షాలు, ఈదురు గాలులు లేకపోవడంతో గతేడాది కంటే ఈ సారి మా మిడి దిగుబడి సుమారు 1.60 లక్షల టన్నులుగా అంచనా వేశారు. ఈ నెల 17 వరకు 70వేల క్వింటాళ్ల మామిడిని వ్యాపారులు కొనుగోలు చేశా రు.ఏటా మామిడి సీజన్‌లో ఢిల్లీ, పంజాబ్‌, హ ర్యానా, మహారాష్ట్ర , ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్తాన్‌, కేరళ ప్రాంతాల నుంచి సుమారు 150 మంది వ్యాపారులు మామిడి కొనుగోళ్ల కోసం జగిత్యా ల జిల్లాకు వస్తుండే వారు. కరోనా కారణంగా ఈసారి 50 మంది మాత్రమే వచ్చారు. దీనికి తోడు జగిత్యాల మామిడి మార్కెటింగ్‌కు కీలకమైన ఢిల్లీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో అక్కడ అమ్మకాలు నిలిచిపోతున్నట్లు సమాచారం. ఫలితంగా మామిడి రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొంత మంది వ్యాపారులు లైసెన్సులు తీసుకున్న మామిడి వ్యాపారులతో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నారు.

Related Posts