YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అద్దెలు తగ్గించండి...

అద్దెలు తగ్గించండి...

న్యూఢిల్లీ ఏప్రిల్ 30, 
కొవిడ్ దెబ్బకి విలవిలలాడుతున్న రిటెయిలర్లు, రెస్టారెంట్ ఓనర్లు రెంట్ పేమెంట్ విధానం మార్చాల్సిందేనని మాల్స్ యజమానులను డిమాండ్ చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ బట్టి కిరాయి తీసుకోవాలని కోరుతున్నారు. ముంబై, ఢిల్లీలతోపాటు ఇతర నగరాలలో వారాల తరబడి లాక్డౌన్ కొనసాగుతుండటంతో రిటెయిలర్లు, రెస్టారెంట్ల బిజినెస్ పడిపోయింది. రాబోయే కొన్ని నెలల్లో ఈ పరిస్థితులలో మార్పు వస్తుందనే ఆశలు కూడా వారిలో కనబడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదిత్య బిర్లా, అరవింద్ ఫ్యాషన్, లెవీస్, బెనెటన్ సహా100 బ్రాండ్లు, సోషల్ అండ్ స్మోక్ హౌస్ డెలి వంటి రెస్టారెంట్లు రెవెన్యూ షేరింగ్కు ఒప్పుకోమని మాల్స్ ఓనర్స్ను కోరాలని ఒక వీడియో కాన్ఫరెన్స్లో డిసైడ్ చేసుకున్నాయి. ఇందుకోసం విడివిడిగా మాల్ ఓనర్లకు మెయిల్స్ పంపాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటిలా మినిమం రెంటల్ గ్యారంటీ కూడా వుండొద్దని కోరుకుంటున్నాయి. లాక్డౌన్తో నష్టాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ భారాన్ని షేర్ చేసుకోవడానికి ఏదో ఒక సరైన సొల్యూషన్ వెతుక్కోవల్సిందేనని మదురా ఫ్యాషన్ సీఈఓ విశాక్ కుమార్ చెప్పారు. ఇద్దరికీ అనువైన ఫార్ములా కోసమే మాల్స్ ఓనర్లతో డిస్కస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లూయీస్ ఫిలిప్, వాన్ హ్యూజెన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్స్ను మదురా ఫ్యాషన్ అమ్ముతోంది. నిజానికి అటు మాల్ ఓనర్లకూ కోవిడ్ పరిస్థితులు కష్టంగానే ఉన్నాయి. ఈ ఏడాది అనిశ్చితే ఉంటుంది. అందుకే, ఏడాది కాలానికి తగిన ఫార్ములా కావాలనుకుంటున్నామని కుమార్ చెప్పారు. కానీ, మాల్స్ ఓనర్లు మాత్రం ఇందుకు సిద్ధంగా లేరు. రిటెయిలర్లు, రెస్టారెంట్ యజమానుల నుంచి ప్రపోజల్ వచ్చిన మాట నిజమేనని, కాకపోతే వారు తొందరపడుతున్నారని ఒక మాల్ టాప్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ మాల్స్, ముంబైలోని ఇన్ఫినిటీ మాల్స్ సహా చాలా మాల్స్ ఈ ప్రపోజల్పై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఇలాంటి ప్రపోజల్స్పై తొందర పడలేమని ముంబైలో ఇన్ఫినిటీ పేరిట రెండు మాల్స్ నడుపుతున్న ముకేష్ కుమార్ చెప్పారు. రెండో వేవ్ తొందరగానే ముగిసిపోతే ఒక రకంగా, మరి కొంత కాలం కొనసాగితే ఇంకో రకంగా సొల్యూషన్స్ ఉండాలి. అందుకే మరి కొంత కాలం వెయిట్ చేయాలని కుమార్ సూచించారు. అసలు రెంట్లో 25 శాతమే కట్టమని కిందటేడాది జూన్లో  డీఎల్ఎఫ్ మాల్ కోరింది. ఆ తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ కాలానికి 50 శాతం, అక్టోబర్–డిసెంబర్ నెలలకు 75–80 శాతం రెంట్ కట్టాలని రిటెయిలర్లను, రెస్టారెంట్ ఓనర్లను డీఎల్ఎఫ్ మాల్ కోరింది. ముంబైలోని మరో మాల్ ఓనరయితే ఏప్రిల్ 2020 నుంచి 2021 కాలానికి రెంట్ను 35 శాతం తగ్గించేశారు. ఫస్ట్ వేవ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే లైఫ్స్టైల్ బ్రాండ్స్ బయటపడుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ ఈ రిటెయిల్ సెగ్మెంట్పైనే బాగా పడింది. కరోనా మహమ్మారి రావడానికి ముందున్న సేల్స్లో 80–90 శాతం సేల్స్ను ఇటీవలే ఈ సెగ్మెంట్  అందుకోగలిగింది.2019ని బేస్ ఇయర్గా తీసుకుని రెంటల్ ఫార్ములా తీసుకురావాలని మాల్స్ ఓనర్లను కోరినట్లు బెనెటన్ ఇండియా సీఈఓ సందీప్ ఛుగ్ చెప్పారు. రిటెయిలర్ల వీడియో కాన్ఫరెన్స్లో ఈయన కూడా పాల్గొన్నారు. మాల్స్ యజమానుల నుంచి ఏమి కోరాలనే దానిపై ఏకాభిప్రాయం కోసమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మాల్స్ యజమానులను మాత్రం తామందరూ విడివిడిగానే కోరుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో అసలు వ్యాపారమే లేదు. దురదృష్టం కొద్దీ ఈ సంవత్సరమూ వైరస్ దెబ్బతీసిందని  50 రెస్టారెంట్లు నడుపుతున్న ఇంప్రెజేరియో సీఈఓ రియాజ్ అమ్లాని అన్నారు. బిజినెస్ జరగడం లేదనే విషయాన్ని మాల్స్ యజమానులకు పంపిస్తున్నామని అమ్లాని వెల్లడించారు. కరోనాకి ముందు మాల్స్లో బిజినెస్ నెలకు రూ. 15 వేల కోట్లు. తాజా రెస్ట్రిక్షన్లు, లాక్డౌన్స్తో  మార్చి నుంచి ఇది 50 శాతం పడింది.

Related Posts