YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

'బాయ్స్' చిత్రం నుంచి రాజా హే రాజా కాలేజ్ సాంగ్ విడుదల..

'బాయ్స్' చిత్రం నుంచి రాజా హే రాజా కాలేజ్ సాంగ్ విడుదల..

శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఒక యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ విడుదల చేశారు. రాజా హే రాజా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.
నటీనటులు:  గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య..

Related Posts