YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అప్పుడు రాజయ్య... ఇప్పుడు రాజేంద్ర

అప్పుడు రాజయ్య... ఇప్పుడు రాజేంద్ర

హైదరాబాద్, మే 3, 
రాజకీయాల్లో సెంటిమెంట్‌ ఎక్కువ. చాలామంది నేతలు ముహూర్తాలు, సెంటిమెంట్లను బాగా నమ్మతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. తెలంగాణలో భూకబ్జా ఆరోపణలతో వైద్యారోగ్య శాఖ నుంచి ఈటల రాజేందర్‌ను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ సెంటిమెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య శాఖ చేపట్టిన మంత్రులెవరూ పూర్తికాలం పదవిలో కొనసాగకపోవడం ఇప్పుడు సెంటిమెంట్‌గా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజయ్య కొన్ని కారణాలతో కేసీఆర్ ఆగ్రహానికి గురై పదవి పోగొట్టుకున్నారు. తాజాగాఈటల రాజేందర్ వ్యవహారం అందరికీ తెలిసిందే.2014లో కేసీఆర్ కేబినెట్లో ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న డాక్టర్ రాజయ్య వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్నెళ్ల పాటు రాజయ్య పదవిలో ఉండగా సీఎం కేసీఆర్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించి కడియం శ్రీహరిని కేబినెట్లోకి తీసుకున్నారు. తర్వాత 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను సీనియర్ నేత ఈటలకు అప్పగించారు. ఈటల మంత్రివర్గంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచే ఆయన్ని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, వెంటనే కేసీఆర్ విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. రెండ్రోజులకే ఆయన్ని వైద్యశాఖ నుంచి తొలగిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేయగా, సోమవారం భర్తరఫ్ చేశారు. దీంతో ఇప్పుడు వైద్యారోగ్య శాఖ అంటేనే నేతలు మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రి పదవిపైనా ఇలాంటి సెంటిమెంట్‌ ఉండేది. ఆ శాఖ మంత్రిగా పనిచేసిన పలువురు నేతలు తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం, లేదంటే మరే పదవులు దక్కకపోవడం ఉండేదని చెప్పుకునేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సెంటిమెంట్ వైద్య శాఖలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Posts