YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గ్రాఫ్ పెంచుకొనేది ఎలా

గ్రాఫ్ పెంచుకొనేది ఎలా

గుంటూరు, మే 4, 
ఎన్నికలు అన్నీ అయిపోయాయి. ఇప్పట్లో బద్వేల్ ఉప ఎన్నిక తప్ప మరో ఎన్నికకు అవకాశం లేదు. బద్వేల్ నియోజకవర్గం సహజంగా అధికార పార్టీ వైసీీపీకి అనుకూలంగానే ఉంటుంది. ఇక చంద్రబాబు తనకు, తన పార్టీకి ప్రజల్లో గ్రాఫ్ పెరిగిందని నిరూపించుకోవడ మెలా? అన్నది పార్టీ నేతలకు సందేహంగా మారింది. ఏదైనా ఎన్నిక జరిగితేనే అధికార పార్టీపై వ్యతిరేకత ఉందా? లేదా? అన్నది అర్థమవుతుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలతో సహా అంతా పూర్తయిపోయాయి.ఇప్పుడు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ కరోనా రూపంలో అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు అటునుంచి అటే హైదరాబాద్ వెళ్లిపోయారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు జూమ్ యాప్ కే పరిమితమయ్యారు. నేతలతో మాట్లాడటం మినహాయించి పర్యటనకు ఇప్పట్లో అవకాశం కన్పించడం లేదు.చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక తర్వాత జిల్లాల పర్యటనను చేయాలని భావించారు. తిరుపతి ఫలితం ఎటు వచ్చినా, తన పర్యటన శ్రేణుల్లో జోష్ నింపిందని చంద్రబాబు గుర్తించారు. నేతలు కూడా తన పర్యటనలో సమన్వయంతో పనిచేయడంతో జిల్లాల పర్యటనల ద్వారానే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలను నియమించడంతో వారితో కూడా భేటీ అయి జిల్లాల సమస్యలపై ప్రభుత్వం పోరాటం చేయాలని భావించారు.కరోనా కారణంగా ఇది మరికొంత కాలం వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఇప్పట్లో చంద్రబాబుకు అవకాశాలు లేవు. తాను సర్వేలు చేయించినా దానిపై ఆయన నమ్మకం కోల్పోయారు. గత ఎన్నికల సందర్భంగా తాను చేయించిన ముందస్తు సర్వేలు ఫెయిల్ కావడంతో దానిపై చంద్రబాబు ఇక సర్వేలపై ఆధారపడకూడదని, క్షేత్రస్థాయి క్యాడర్ నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నది చంద్రబాబు నిర్ణయంగా ఉంది. కరోనా వేవ్ తగ్గిన తర్వాత పదమూడు జిల్లాల పర్యటనకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Related Posts