YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

క్వశ్చన్ చేస్తే...అంతే సంగతులా నరేంద్ర నుంచి రాజేంద్రుడు వరకు

క్వశ్చన్ చేస్తే...అంతే సంగతులా నరేంద్ర నుంచి రాజేంద్రుడు వరకు

హైదరాబాద్, మే 4, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను థిక్కరించిన వారిని ఎవరినీ స్పేర్ చేయరు. ఆయన ఉద్యమకాలం నుంచి అంతే. ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తుందో రాదో అని తెలిసినా ఆరోజు తన నుంచి అనేక మంది దూరమయ్యారు. దానికి కారణం ఆయనను థిక్కరించడమే. ఇక అధికారంలోకి వస్తే కేసీఆర్ ఊరుకుంటారా? అది అసాధ్యం. తాను పెద్దల వద్ద ఎంత అణుకువ పాటిస్తారో దానినే కేసీఆర్ కోరుకుంటారు. థిక్కార స్వరాన్ని విన్పించడాన్ని సహించరు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులమని చెప్పుకుని తిరిగే వారు చాలా తక్కువ. రాజకీయ జేఏసీ ఛైర్మన్ ను చేశారు. కోదండరామ్ ను ఉద్యమకాలంలో కేసీఆర్ పొగిడినట్లు ఎవరూ పొగిడి ఉండరు. ఉద్యమమంతా ఆయనను అడ్డం పెట్టుకుని నడిపి రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత కోదండరామ్ ను పూర్తిగా దూరం పెట్టేశారు. విజయశాంతిని తన సొంత చెల్లెలని ఆదరించారు. ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకున్నారు. ఎంపీని చేశారు. కట్ చేస్తే విజయశాంతిని కేసీఆర్ పక్కన  పెట్టేశారు.  ఇక స్వామి గౌడ్ విషయంలోనూ అంతే. స్వామిగౌడ్ ను అందలం ఎక్కించారు. ఆయనను ఎమ్మెల్సీని చేసి మరీ శానసమండలి ఛైర్మన్ ను చేశారు. ఉద్యోగ సంఘాల నేతగా ఎదిగిన స్వామిగౌడ్ ను కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ పొగిడారు. కానీ అదే సమయంలో రెండోసారి పక్కన పెట్టేశారు. ఇక కొండా దంపతుల విషయాన్ని తీసుకున్నా అంతే. కొండా దంపతులు ఎవరు అవునన్నా కాదన్నా జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపుతారు. కానీ హరీశ్ రావుతో సన్నిహితంగా ఉంటున్నారన్న ఏకైక కారణంతో వారికి టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో వారంతట వారే బయటకు వెళ్లిపోయారు.కాంగ్రెస్ నుంచి వచ్చిన డి.శ్రీనివాస్ కు తొలుత కేబినెట్ పదవి ఇచ్చారు. ఆతర్వాత రాజ్యసభ పదవి ఇచ్చారు. అనంతరం పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయనను పట్టించుకోలేదు. ఇక తాజాగా ఈటల రాజేందర్ దీ అదే పరిస్థితి. ఉద్యమ కాలం నుంచి తన వెంటే ఈటల రాజేందర్ ను కేసీఆర్ తిప్పుకున్నారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా చేశారు. రెండు దఫాలు మంత్రిని చేశారు. ఒకసారి కీలమైన ఆర్థిక శాఖ, మరోసారి వైద్య ఆరోగ్యశాఖ కట్టబెట్టారు. కానీ తన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ఈటలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. అందుకే కేసీఆర్ ప్రేమించినా, ద్వేషించినా అంతేనని, ఆయనతో అంటీముట్టనట్లుగా ఉండటమే మేలన్న కామెంట్స్ పార్టీలో విన్పిస్తుండటం విశేషం.

Related Posts