YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నేనే సీఎం అంటూ... పాఠాలు

నేనే సీఎం అంటూ... పాఠాలు

హైదరాబాద్, మే 4, 
నే కాబోయే సీఎం. ఇది కమర్షియల్ సినిమాకు అద్భుతంగా సూట్ అయ్యే టైటిల్. అదిరిపోయే కలెక్షన్లు కూడా వస్తాయి. కానీ రియల్ లైఫ్ లో రాజకీయ తెర మీద మాత్రం అచ్చి రాని అట్టర్ ఫ్లాప్ టైటిల్ ఏదైనా ఉందంటే ఇదేనేమో. ప్రతీ వారూ పెద్ద కుర్చీకే గేలం వేస్తారు. ఎందుకంటే అది ఎత్తుగా ఉండి అందరికీ కనిపిస్తుంది. అంతే కాదు తెగ ఆకర్షిస్తుంది. తామేం తక్కువ అని ప్రతీ నాయకుడూ అనుకుంటాడు. ఇక కొత్తగా పాలిటిక్స్ లోని వచ్చే వారు. పార్టీలు పెట్టే వారు అయితే కాబోయే సీఎం తామే అన్న ధీమాను ఒలకబోస్తారు.ఏపీ రాజకీయాలో ఈ కాబోయే సీఎం టైటిల్ కి చాలా పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. 2008లో మెగాస్టార్ చిరంజీవితో మొదలుపెడితే 2021లో వైఎస్ షర్మిల దాకా అందరూ అదే ట్యాగ్ తో పాలిటిక్స్ లో జోరు చేస్తున్నారు. ముందుగా చిరంజీవి గురించి చెప్పుకుంటే ఆయన అంతకు నాలుగేళ్ల ముందు తన సినిమాల ద్వారా రాజకీయ ఆకాంక్షలను వినిపించారు. ఇంద్ర సినిమాలో అయితే అక్కడ ఇంద్రుడిదే సింహాసనం అయితే ఇక్కడ ఇంద్రదే ఈ సింహాసనం అంటూ ఏపీ సీఎం సీటు మీద చిరు ఇండైరెక్ట్ గా భారీ డైలాగులే కొట్టారు. సరే చిరంజీవి టార్గెట్ మంచిదే కానీ ప్రాక్టికల్ గా అది ఏమైందో అందరికీ తెలిసిందే. దానికి చిరు అతి అంచనాలతో పాటు ఎదుటివారి బలాన్ని కూడా ఊహించుకోకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే తనకు పదవుల మీద వ్యామోహం లేదంటూనే సీఎం పోస్ట్ గురించి బాగానే కలవరించారు. నేను సీఎం అయితే తప్పేంటి అని 2019 ఎన్నికల వేళ ఆయన తన కోరికను బయట పెట్టుకున్నారు. ఇక కాబోయే సీఎం అంటూ తరచూ తన ఫ్యాన్స్ ద్వారా అనిపించుకోవడంలోని అనిర్వచనీయమైన అనుభూతిని ఆయన పొందుతున్నారు. ఈ మధ్యనే బీజేపీ కూడా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ తీయనైన మాటలని వల్లించింది. మొత్తానికి ఏపీ వరకూ చూస్తే కాబోయే సీఎం పవనే. మరి అది ఎంత దూరంలో ఉంది. ఎపుడు సాకారం కాబోతుంది అన్నది భవిష్యత్తు చెప్పాలిఆలూ లేదు చూలూ లేదు అని ఒక ముతక సామెత ఉంది. అలా ఉంది వైఎస్ షర్మిల వ్యవహారం. ఆమె పార్టీని ఇంకా పెట్టలేదు, దాని రంగూ రుచి వాసన అసలు తెలియదు. కానీ అపుడే ఆమె నోట సీఎం మాట వస్తోంది. నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వాలంటూ ఆమె తాజాగా చేసిన పవిత్ర దీక్ష ఉద్దేశ్యాన్ని నీరుకార్చేలా పదే పదే సీఎం మాటలను వల్లించారు. తాను కాబోయే సీఎం ని అని షర్మిల చెప్పుకున్నారు. రెండేళ్ళు ఆగితే నేనే తెలంగాణాకు సీఎం ని అంటూ షర్మిల తన రాజకీయ అరంగ్రేట్రం వెనక ఉన్న ఆశలను ఏ మొహమాటం లేకుండా బయటపెట్టారు.కానీ వైఎస్ షర్మిలను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. సాధారణంగా జనాలను దేవుళ్ళతో పోల్చాలి. ఏ కోరికలూ లేకుండా దేవుడికి దండం పెడితే ఆయన అనుకున్నవన్నీ తీరుస్తాడు అంటారు. అలాగే ప్రజలు కూడా తమ కోసం మంచి చేస్తున్నారు అని ఎవరినైనా భావిస్తే వారిని తెచ్చి అందలం మీద కూర్చోబెడతారు. అదే వారు తమకు ఆ పీఠం కావాలి అంటూ జనంలోకి వస్తే మాత్రం ఎందుకో ఆశీర్వదించరు. అంటే వారి సేవ వెనక స్వార్ధం ఉందని గ్రహించబట్టే ఇదంతా అనుకోవాలి. మరి కాబోయే సీఎం కి కుర్చీలో కూర్చున్న సీఎం కి మధ్య ఆకాశానికీ భూమికీ మధ్య ఉన్నంత అంతరం ఉంది. దాన్ని అర్ధం చేసుకోనంతవరకూ ఆరాటాల పోరాటాలుగా నేతశ్రీలు మిగిలిపోతారు అంతే.

Related Posts