YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లాక్ డౌన్ భయం

లాక్ డౌన్ భయం

హైదరాబాద్, మే 4, 
తెలంగాణ కరోన సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతుండడంతో హైదరాబాద్ లో పనిచేసే అసంఘటిత రంగం కార్మికుల్లో భయాందోళన మొదలైంది. ఒకవైపు లాక్ డౌన్ భయం, మరోవైపు పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దిక్కులేనిస్థితిలో వలస కార్మికులు సొంత రాష్ట్రాల బాట పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వలస కార్మికులతో కిటకిటలాడిపోతుంది. గతంలో హైదరాబాద్ లో దాదాపు 5 లక్షల మంది వలస కార్మికులు ఉండేవారు. గత సంవత్సరం లాక్ డౌన్ తో సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. కరోనా తీవ్రత తగ్గడంతో 3 లక్షల మంది తిరిగివచ్చారు. మెల్లగా మొదలైన పనులు మాములు స్థితికి చేరుకున్నాయి. గత నెల నుంచి తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వలస కార్మికుల్లో అలజడి మొదలైంది ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో హైదరాబాద్ లోని వలస కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక్కడ కూడా లాక్ డౌన్ విధిస్తారేమోనన్న భయం వెంటాడుతుంది. కొద్ది రోజుల నుంచి వేలాది మంది కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మిగతావారు కూడా అదే బాట పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు భారీగా తరలివస్తున్నారు. టికెట్ దొరక్క రోజులపాటు స్టేషన్ బయట అవస్థలు పడుతున్నారు. నార్త్ ఇండియా రైళ్ల సంఖ్య పెంచారు. కరోనా నేపథ్యంలో పరిమిత స్థాయిలో స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్ మీదుగా నడుస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్, ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నవారికే అనుమతిస్తున్నారు. హైదరాబాద్ లో ఎక్కువగా ఉత్తారాది రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉపాధి పొందుతున్నారు. కరోనా దెబ్బకు ఇప్పటికే పలువురి ఉపాధి పోయింది. ఇప్పటికే వేలాది మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.  సికింద్రబాద్ రైల్వే స్టేషన్ మీదుగా 185 రైళ్ళు నడుస్తుండేవి. ఇందులో ప్రయాణికులు లేని కారణంగా కొన్ని రైళ్ళు రద్దు చేశారు. నార్త్ ఇండియా వైపు మరిన్ని రైళ్లు పెంచారు. ఇప్పట్టికే రిజర్వేషన్ ద్వారానే టికెట్ లు బుక్ అవుతుండడంతో చాలా వరకు వలస కార్మికలకు టికెట్లు అందడం లేదు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. వలస కార్మికులకు ఆర్థిక భరోసాను ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. సొంతూరు వెళుతున్న వలస కార్మికుల రైళ్ల సంఖ్యను పెంచాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts