YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విదేశీయం

రష్యా స్కూల్ లో కాల్పులు

రష్యా స్కూల్ లో కాల్పులు

మాస్కో, మే 11, 
రష్యాలోని ఓ పాఠశాలపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా మంది విద్యార్థులను బందీలుగా చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు కాల్పిచంపినట్లు వార్తలు వచ్చాయి.రష్యాలోని కజాన్ నగరంలో మంగళవారం ఉదయం ఒక పాఠశాలలోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 13 మంది మరణించారు. మరణించిన వారిలో 8 మంది పిల్లలు, ఓ ఉపాధ్యాయుడు ఉన్నారు. పాఠశాలలో పేలుడు, కాల్పులతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పెద్ద ఎత్తున పొగ వెలువడటంతో అగ్నిప్రమాదం భావించి పలువురు భవనంపై నుంచి దూకినట్లు సమాచారం.దాడి జరిగినప్పుడు ఇద్దరు పిల్లలు మూడో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకినట్లు అత్యవసర సేవ ప్రతినిధులు తెలిపారు. ఎత్తు నుంచి పడిపోవడంతో ఇద్దరు మరణించారని ఆయన చెప్పారు. పాఠశాల నాలుగో అంతస్తులో దాడి చేసిన వ్యక్తి కూడా కొంతమందిని బందీగా చేసుకున్నాడని రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ తెలిపింది. గాయపడిన 12 మందిని స్థానిక దవాఖానలో చేర్చారు.పాఠశాల లోపల కూడా పేలుడు జరిగిందని వార్తా సంస్థ తెలిపింది. కాల్పులు జరుపడానికి ముందు వారు పేలుళ్లు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. పేలుడు శబ్ధాలు విన్న పలువురు విద్యార్థులు పాఠశాల పై అంతస్థుల నుంచి కిందికి దూకారని, వారిలో చాలా మందికి తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు.దాడి విషయం తెలియగానే భద్రతా దళాలు రంగంలోకి దిగి పాఠశాలను చుట్టుముట్టాయి. కాల్పులకు తెగబడినవారిని పట్టుకునేందుకు వారు సిద్ధమయ్యారు. దాడికి పాల్పడిన ఇద్దరిని భద్రతా దళాలు కాల్చిచంపాయి. షూటర్ వయస్సు 19 సంవత్సరాల వరకు ఉంటుందని, అతడి వద్ద రిజిస్టర్డ్ గన్ ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 17 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాఠశాల భవనం దెబ్బతిన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

Related Posts