YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

ర‌ష్యా స్పుత్నిక వి వ్యాక్సిన్ డోసు ధ‌ర‌ను రూ.995.40 లు

ర‌ష్యా స్పుత్నిక వి వ్యాక్సిన్ డోసు ధ‌ర‌ను రూ.995.40 లు

హైద‌రాబాద్‌ మే 14
ర‌ష్యాకు చెందిన స్పుత్నిక వి వ్యాక్సిన్ డోసు ధ‌ర‌ను రూ.995.40గా నిర్ణ‌యించిన‌ట్లు శుక్ర‌వారం వెల్ల‌డించింది డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌. ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకున్న టీకాల‌కు ఈ ధ‌ర ఉంటుంద‌ని, ఇండియాలో త‌యారయ్యే వాటికి త‌క్కువ ధ‌ర ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ల్యాండైన ఈ టీకా ఎమ్మార్పీని రూ.948గా నిర్ణ‌యించ‌గా.. దానికి 5 శాతం జీఎస్టీ క‌లిపితే ధ‌ర రూ.995.40 అవుతుంది. ఈ టీకా తొలి డోసును ఇప్ప‌టికే హైద‌రాబాద్ వ్య‌క్తికి వేసిన‌ట్లు రెడ్డీస్ ల్యాబ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ నెల 1వ తేదీనే ల‌క్ష‌న్న‌ర స్పుత్నిక్ వి టీకాలు హైద‌రాబాద్‌లో దిగిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే కొద్ది నెల‌ల్లో మ‌రిన్ని డోసులు దిగుమ‌తి అవుతాయ‌ని, త్వ‌ర‌లోనే ఇండియాలోనూ ఈ వ్యాక్సిన్ తయారీ ప్రారంభిస్తామ‌ని చెప్పింది.

Related Posts