YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

మార్స్ గ్ర‌హంపై దిగిన చైనా రోబో జురాంగ్ రోవ‌ర్‌..

మార్స్ గ్ర‌హంపై దిగిన చైనా రోబో జురాంగ్ రోవ‌ర్‌..

బీజింగ్‌ మే 15
 డ్రాగ‌న్ దేశానికి చెందిన జురాంగ్ రోవ‌ర్‌.. మార్స్ గ్ర‌హంపై దిగింది. ఆరు చ‌క్రాలు ఉన్న రోబోను విజ‌య‌వంతంగా దించిన‌ట్లు చైనా మీడియా పేర్కొన్న‌ది. అంగార‌క గ్ర‌హంపై ఉన్న ఉతోపియా శ్రేణుల‌ను టార్గెట్ చేస్తూ ఈ రోవ‌ర్‌ను లాంచ్ చేశారు. ఉత్త‌ర ద్రువం వ‌ద్ద ఉన్న ప్‌పతికూల ప‌రిస్థితుల్లో రోవ‌ర్‌ను ల్యాండ్ చేయ‌డం అసాధార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం అమెరికా మాత్ర‌మే మార్స్ గ్ర‌హంపై త‌న రోవ‌ర్‌ను ల్యాండ్ చేసింది.అంగాక‌ర‌క గ్ర‌హంపై వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన అన్ని దేశాలు విఫ‌లం అయ్యాయి. ఆ గ్‌దహం స‌మీపానికి వెళ్లిన త‌ర్వాత ఇత‌ర దేశాల రోవ‌ర్లు కూలిపోయాయి. కొన్ని కాంటాక్ట్ లేకుండా పోయాయి. జురాంగ్ రోవ‌ర్ విజ‌య‌వంతంగా దిగిన సంద‌ర్భంగా చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ ఆ మిష‌న్ బృందానికి కంగ్రాట్స్ తెలిపారు. గ్ర‌హాన్వేష‌ణ‌లో దేశాన్ని అగ్ర‌ప‌థంలో నిలిపిన‌ట్లు ఆయ‌న వారిని కీర్తించారు. బీజింగ్ కాల‌మానం ప్ర‌కారం శ‌నివారం ఉద‌యం 7.18 నిమిషాల‌కు రోవ‌ర్ ల్యాండ్ అయ్యింది. రోవ‌ర్ దిగిన 17 నిమిషాల త‌ర్వాత దాని సోలార్ ప్యానెల్స్ తెరుచుకున్నాయి. ఆ త‌ర్వాత అది భూమికి సిగ్న‌ల్స్ పంపింది.చైనా భాష‌లో జురాంగ్ అంటే అగ్ని దేవుడు. అయితే జురాంగ్ రోవ‌ర్‌ను.. తియాన్‌వెన్‌-1 ఆర్బిటార్‌లో తీసుకువెళ్లారు. ఫిబ్ర‌వ‌రిలో దాన్ని ప్ర‌యోగించారు. మార్స్ మీద ఉటోపియా ప్రాంతంలో రోవ‌ర్‌ను దించేందుకు తొలుత శాస్త్ర‌వేత్త‌లు హై రెజ‌ల్యూష‌న్ చిత్రాల‌ను తీశారు. ఆ త‌ర్వాత సేఫ్ ల్యాండింగ్ చేశారు. దేనితో అగ్ర‌రాజ్యం అమెరికా స‌ర‌స‌న చైనా చేరింది.
 

Related Posts