YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు దేశీయం

500 ఆవులు, 3 లగ్జరీ కార్లు, రూ.1.44 లక్షల కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యాపారవేత్త

500 ఆవులు, 3 లగ్జరీ కార్లు, రూ.1.44 లక్షల కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యాపారవేత్త

న్యూ డిల్లీ మే 16,
పెళ్లి సంప్రదాయాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. ఇక గిరిజన మారుమూల తెగల్లో అయితే ఇంకా విభిన్నంగా ఈ పెళ్లితంతులు సాగుతుంటాయి. మతాలు ప్రాంతాలు తెగల వారీగా పెళ్లి ఆచార వ్యవహారాలు ఉంటాయి. అయితే అన్నింటికంటే విభిన్నంగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్ ప్రాంతంలో జరిగే పెళ్లిళ్లు చాలా వింతగా ఉంటాయి. ఇక్కడ పెళ్లి చూపుల వంటి తతంగాలు ఉండవు. వధువులను సంతలో వేలం పాటలో పశువులను అమ్మినట్లు అమ్మేస్తారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే ఆ అమ్మాయి వారి సొంతం అవుతుంది. భారత్ లో అప్పట్లో వచ్చిన కన్యాశూల్యం తీరుగా ఉంటుందీ వ్యవహారం.
అత్యంత పేదరిక దేశం కావడంతో పేదరికంలో ఉన్న కుటుంబాలు అమ్మాయిలకు పెళ్లి చేయలేక ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. అమ్మాయిని వేలంలో నగదు విలువైన వస్తువులు లేదా పశుసంపదను ఇవ్వడం ద్వారా పాట పాడి ఆమె దక్కించుకోవాలి. అత్యంత విలువైన వస్తువులు ఎవరు ఇస్తే వారికే ఆ అమ్మాయి దక్కుతుంది. ఇటీవల దక్షిణ సూడాల్ లో ఒక వ్యాపారవేత్త ఇలాంటి వేలంలోనే 500 ఆవులు 3 లగ్జరీ కార్లు రూ.1.44 లక్షల కట్నం ఇచ్చి మరీ 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇదే సూడాల్ లో అమ్మాయిని శవానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. చావుకు దగ్గరపడిన వ్యక్తి ఇంటికి పెళ్లి సంబంధం కలుపుతారు. ఆ వ్యక్తి చనిపోయాక శవానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. చనిపోయిన వ్యక్తి సోదరులు ఉంటే వాళ్లతో శోభనం చేయిస్తారు. ఇదొక దుష్ట సంప్రదాయంగా దీన్ని నిర్మూలించాలని అంతర్జాతీయ సంస్థలు ఉద్యమాలు చేస్తున్నాయి.

Related Posts