YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

భారీ సంఖ్యలో మిడతలు పంట పొలాలపై దాడి చేసే అవకాశం! రైతులని అప్రమత్తం చేసిన అలీఘర్ జిల్లా అధికారులు

భారీ సంఖ్యలో మిడతలు పంట పొలాలపై దాడి చేసే అవకాశం!   రైతులని అప్రమత్తం చేసిన అలీఘర్ జిల్లా అధికారులు

లక్నో మే 24
త్వరలోనే భారీ సంఖ్యలో మిడతలు పంట పొలాలపై దాడి చేసే అవకాశం ఉందని అలీఘర్ జిల్లా అధికారులు రైతులని అప్రమత్తం చేశారు. మిడతలు  అకస్మాత్తుగా రావడం.. పచ్చదనాన్ని నాశనం చేసి వెళ్లిపోవడం మిడతల దండు స్వభావం. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణించి ఆ మార్గంలో ఉన్న పంట పొలాలు చెట్లపై వాలిపోతాయి. పంటను తిని మరో ప్రాంతానికి దండెత్తుతాయి. వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మచ్చుకు మన దేశానికి కూడా గతేడాది అనుభవమైంది. ముఖ్యంగా యూపీ మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో మిడతల ప్రభావం బాగా ఎక్కువగా ఉన్నది.వేల ఎకరాల పంట ను ఈ మిడతలు నాశనం చేశాయి. దీనితో రైతులు వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. మళ్లీ మిడతల ముప్పు పొంచి ఉందని అధికారులు చెప్పడం తో రైతులు ఆందోళనకి గురౌతున్నారు. ఇకపోతే ఇవే మిడతల దండు తూర్పు ఆఫ్రికాలోని కెన్యా ఇథియోపియాను వణికిస్తోంది. అసలే కరోనా మహమ్మారి కరవు ఆర్థిక సంక్షోభంతో తిప్పలు పడుతున్న ఆ దేశాలకు ఇప్పుడు ఈ దండు పెద్ద గుది బండగా మారింది. ముఖ్యంగా కెన్యాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ రెండో దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా కెన్యాలోనే జరుగుతున్నాయి. వాటిని పారదోలేందుకు సైనికులు కూడా రంగంలోకి దిగారు అంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతాలు జనావాసాలు కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిచికారీ చేస్తూ.. వాటిని కట్టడి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Related Posts