YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆనందయ్య ఔష‌ధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

ఆనందయ్య ఔష‌ధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

అమ‌రావ‌తి మే 31
ఆనందయ్య ఔష‌ధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్ త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగ‌తా మందుల పంపిణీకి ఏపీ ప్ర‌భుత్వం ప‌చ్చ జెండా ఊపింది. కె అనే మందును కూడా క‌మిటీ ముందు చూపించ‌నందున దీన్ని నిరాక‌రించారు. ఆనంద‌య్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందుల పంపిణీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్ర‌కారం ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. కంట్లో వేసే ముందుపై ఇంకా నివేదిక‌లు రావాల్సి ఉన్నాయి. ఆనంద‌య్య ఔష‌ధం వ‌ల్ల హానీ లేద‌ని నివేదిక తేల్చింది.సీసీఆర్ఏఎస్ నివేదిక ప్ర‌కారం ఆనంద‌య్య మందు వాడితే హానీ లేద‌ని నివేదిక‌లు పేర్కొన్నాయి. అయితే ఆనంద‌య్య మందు వాడితే కొవిడ్ త‌గ్గుతుంద‌న‌డానికి నిర్ధార‌ణ‌లు లేవ‌ని నివేదిక‌లు తేల్చిచెప్పాయి. కంట్లో వేసే డ్రాప్స్ విష‌యంలో నివేదిక‌లు రావ‌డానికి 2 నుంచి 3 వారాల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఆనంద‌య్య మందును వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్ద‌ని రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. ఈ ఔష‌ధాన్ని తీసుకోవ‌డానికి కొవిడ్ రోగులు కాకుండా, వారి సంబంధీకులు వెళ్లాల‌ని సూచించింది. ఔష‌ధం పంపిణీ సంద‌ర్భంగా కొవిడ్ ప్రోటోకాల్ పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

Related Posts