YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానశేఖర్‌ ద్వారక, వర్గో పిక్చర్స్‌ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానశేఖర్‌ ద్వారక, వర్గో పిక్చర్స్‌ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా సినిమాపై కూడా అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలకృష్ణగారి స్పీచ్‌ హైలైట్‌గా నిల‌వ‌డంతో పాటు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలైపోయాయి. ప్రశాంత్‌ ఆర్‌ విహరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు మేక‌ర్స్‌. ‘కచడ కచడ హో గయా.... అర్థమైత లేదయా, అచట ముచట లేదయా...’ అంటూ మొదలైయ్యే ఈ పాట  ‘‘ఇక లైట్‌ లేలోరే! మాస్‌ స్టెప్పు వేయ్‌ రే..నేను ఆడాలన్నా..పాడాలన్నా జిందగీలో లేదే సెహరి...చిల్‌ అవ్వాలన్నా లవ్వాలన్నా జిందగీలో లేదే సెహరి..సెహ‌రి’’ అంటూ సాగుతుంది. సోమవారం విడుదలైన ఈ క్యాచీ సాంగ్‌ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌లో హర్ష్‌ డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అదిరిపోయాయి. ఈ పాటకు యశ్‌ మాస్టర్‌ కొరియో గ్రఫీ చేశారు. హిట్‌ ఫిల్మ్‌ ‘జాతిరత్నాలు’ సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే..’ అనే సాంగ్‌ పాడిన ‘చౌరస్తా బ్యాండ్‌’ ఫేమ్‌ రామ్‌ మిరియాల ‘‘జిందగీలో లేదే సెహరి..సెహరి’ పాటను పాడారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్‌ అందించారు.
యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌధ‌రి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తుండటం విశేషం.
నటీనటులు: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ

Related Posts