YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆరోగ్యం దేశీయం

74 కోట్ల టీకాలకు కేంద్రం ఆర్డర్

 74 కోట్ల టీకాలకు కేంద్రం ఆర్డర్

న్యూఢిల్లీ, జూన్ 9, 
గస్టు నుంచి 44 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి ఆయా సంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపింది. 19 కోట్ల కొవాగ్జిన్‌  వ్యాక్సిన్ డోసుల కోసం భారత్‌ బయోటెక్‌కు.. 25 కోట్ల కొవిషీల్డ్‌ టీకా డోసుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఆర్డర్లు పెట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. మరోవైపు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్‌-ఇ రూపొందిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ 30 కోట్ల డోసులను ఇప్పటికే బుక్‌ చేసుకున్నట్లు కేంద్రం గతవారం ప్రకటించింది. అయితే.. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇంకా అనుమతులు రావాల్సి ఉందిదేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రమే అర్హులందరికీ ఫ్రీగా టీకాలు అందజేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే భారీ మొత్తంలో టీకా డోసుల కోసం ఆర్డర్‌ చేసింది.

Related Posts