YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జ్యేష్ట మాసం విశిష్టత

జ్యేష్ట మాసం  విశిష్టత

చాంద్రమానం ప్రకారం చైత్ర .. వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు ... పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది.  
పితృదేవతల రుణం తీర్చుకోవడానికీ ... పాపాలను పరిహరించుకోవడానికి  దైవసేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి.
పార్వతీదేవి ఆచరించిన *'రంభావ్రతం'* ...
వివాహిత స్త్రీలు ఆచరించే *'అరణ్యగౌరీ వ్రతం'* ..
గంగానది స్నానంతో పదిరకాల పాపాలను హరించే *'దశాపాపహర దశమి'* 
*'త్రివిక్రమ ఏకాదశి'*  పేరుతో పిలవబడే *'నిర్జల ఏకాదశి'*  భక్తకోటిపై తమ ప్రభావం చూపుతుంటాయి.
అలాగే సూర్యుడిని ఆరాధించే *'మిథున సంక్రమణం'* 
వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే *'ఏరువాక పున్నమి'* ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి.
దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే *'జ్యేష్ఠ పౌర్ణమి'*
శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే *'యోగిని ఏకాదశి'* ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
ఈ మాసంలో  విష్ణువుని స్మరిస్తూ నీటి కుంభం విసనకఱ్ఱ చందనాన్ని దానం చేయాలి
ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను ... మరెన్నో విశేషాలను సంతరించుకుని , పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ వుంటుంది-
జై శ్రీమన్నారాయణ

Related Posts