YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ లో కమలం తంటాలు

బెంగాల్ లో కమలం తంటాలు

కోల్ కత్తా, జూన్ 11, 
పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఎన్నికలు ముగిశాయి. మమతను అధికారానికి దూరంగా పెడదామని బీజేపీ వేసిన ఎత్తుగడలు ఫలించినా.. అవి ఆమెను ప్రజల నుంచి దూరం చేయలేదు. ఎన్నికలు ముగిసి సీఎంగా మమత బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీకి అసలు కష్టాలు మొదలయ్యాయి. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి బీజేపీ నేతలు నానాతంటాలు పడుతున్నారు.ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయిన వారు ఇప్పుడు సొంత గూటి వైపు చూస్తున్నారు. తాజాగా బీజేపీ పక్ష సమావేశం నిర్వహించగా దానికి పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ హాజరుకాలేదు. ముకుల్ ఎందుకు సమావేశానికి రాలేదన్న దానిపై బీజేపీ రాష్ట్ర శాఖ వద్ద జవాబు లేదు. సొంత గూటికి చేరే పనిలో భాగంగానే ఆయన భేటికి రాలేకపోయారని ముకుల్ రాయ్ తనయుడు సుభ్రాంషు అంటున్నారు. బీజేపీ నుంచి 35 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని టీఎంసీ నేతలు అంటున్నారు.ఎన్నికలు ముగిసి నాలుగు వారాల్లోపే నేతలు మనసు మార్చుకోవటంపై బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదు. ఎన్నికల సమయంలో టీఎంసీ లక్ష్యంగా ముప్పేట దాడి చేసింది బీజేపీ. బెంగాల్లో బీజేపీ ఎంపీలు ఇద్దరు ఇక్కడి పరిస్థితిపై వివరించేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ 18 సీట్లు గెలిచి టీఎంసీకి షాకిచ్చింది.

Related Posts