YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం జగన్ భయపడుతున్నారు

సీఎం జగన్ భయపడుతున్నారు

విజయవాడ
ముఖ్యమంత్రి జగన్ కి అమరావతి రైతుల ఫోబియా పట్టుకుందని అమరావతి మహిళా జేఏసీ నేత, ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.  అమరావతి పేరు విన్నా, రైతుల ఉద్యమం గురించి విన్నా ముఖ్యమంత్రి భయపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని  బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే బటన్ సీఎం అమరావతి రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు. కరోనా సమయంలో ఉపాధి లేక రైతులు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బటన్ సీఎం జగన్  అమరావతి రైతులకు కూడా బటన్ నొక్కి వారికి వార్షిక కౌలు చెల్లించాలి. రైతు కూలీలకు ఇస్తున్న జీవన భృతి పెంపు హామీ ఏమైంది ? అమరావతి రైతులు ఆంద్రప్రదేశ్ ప్రజలు కాదా ? ఎందుకు వారిని వేరుగా చూస్తున్నారు. బటన్ సీఎం తక్షణమే రైతులకు వార్షిక కౌలు, రైతు కూలీలకు జీవన భృతి చెల్లించాలని అన్నారు.

Related Posts