
వాషింగ్టన్ జూన్ 17
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత సంతతి సీఈఓ సత్యనాదేళ్లకు ఛైర్మన్‌గా సంస్థ అదనపు బాధ్యతలు అప్పగించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సత్యనాదేళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బుధవారం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్ డబ్ల్యూ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. ఇంతకుముందు కూడా థామ్సన్ 2012 నుంచి 2014 వరకు ఈ పదవిలో కొనసాగారు. కాగా, సత్యనాదేళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టీవ్ బాల్మెర్ నుంచి సత్యనాదేళ్ల ఈ బాధ్యతలు స్వీకరించారు.ఇక సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, లింక్డ్ఇన్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో పాటు అనేక డీల్స్‌తో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో ఈ తెలుగు తేజం కీలకంగా వ్యవహరించారు. అలాగే ఆయన సీఈఓగా వచ్చాక మైక్రోసాఫ్ట్ లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్‌పై సంస్థ విస్తృతంగా పనిచేయడంతో మొబైల్ రంగంపై పట్టు సాధించింది.