YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసుల అదుపులో మహిళ మృతి లాకప్ డెత్ అంటున్న బంధువులు, దళిత సంఘాలు

పోలీసుల అదుపులో మహిళ మృతి లాకప్ డెత్ అంటున్న బంధువులు, దళిత సంఘాలు

యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మహిళ మృతి సంచలనంగా మారింది.. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందినట్టు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.  అడ్డగూడూరు మండలంలోని గోవిందాపురంలో చర్చ్  ఫాదర్ బాలశౌరి ఇంట్లో రూ.2 లక్షలు చోరికీ గురయ్యాయి. మృతురాలు మరియమ్మ అక్కడ వంట మనిషిగా పనిఏస్తోంది. అంతకుముందు మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్, అతని స్నేహితుడు శంకర్ వచ్చి రెండు రోజులున్నారు.  తరువాత వారితోపాటు మరియమ్మ సొంత ఊరుకి వెళ్లింది.  రెండు లక్షల రూపాయలు కనపడకపోవడంతో చర్చ్ ఫాదర్ ప పనిమనిషి మీద అనుమానంతో పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు పాస్టర్.. మొదట మరియమ్మ, ఆతర్వాత ఆమె కొడుకు ఉదయ్‎ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడు శంకర్, మరియమ్మ కూతురు నుంచి పోలీసులు కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  విచారణలోభాగంగా తల్లి, కొడుకుని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని ఉదయ్ స్నేహితుడు శంకర్ ఆరోపిస్తున్నాడు.. అడ్డుకోవడానికి యత్నించిన తనను కూడా పోలీసులు చితకబాదారని శంకర్ చెబుతున్నారు.. ఇక, పోలీసుల దెబ్బలు తాళలేక మరియమ్మ స్పృహ తప్పి పడిపోయిందని.. వెంటనే ఆమెను మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ఆమె పరిస్థితి విషమయంగా ఉండడంతో.. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ చనిపోయిందని ఆమె కుటుంససభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక, పోస్టుమార్టం నిమిత్తం మరియమ్మ మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Related Posts