YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

15 రోజుల్లో సమస్య ను పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం జేఎన్ఎన్యూఆర్ఎం బాధితులు

15 రోజుల్లో సమస్య ను పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం జేఎన్ఎన్యూఆర్ఎం బాధితులు

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా  మీర్పేట్ సిఐ ను  కలిసిన జేఎన్ఎన్యూఆర్ఎం బాధితులు తమకు కేటాయించిన ఇళ్లను తమకు ఇప్పించేలా చొరవ తీసుకోవాలని  కోరారు. తరువాత వారంతా పెద్ద ఎత్తున మీర్ పేట్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలతో విచారణ నిర్వహించిన మీర్పేట్ సిఐ నివేదికను సీపీకి అందజేయనున్నట్టు తెలిపారు. ఎల్బీనగర్ నియోజవర్గం పరిధిలోని మీర్ పేట్ నందనవనంలో జె.ఎన్.ఎన్.యూ.ఆర్.ఎమ్ స్కీమ్ కింద ప్రభుత్వం 512 నివాస గ్రుహాలను నిర్మించిందని వాటి తాళాలను కూడా తమకు అప్పగించాక. అధికారపార్టీకి చెందిన కొందరు తమ ఇళ్లను కబ్జాచేశారని ఆరోపించారు.  అక్కడి వెళ్తే కబ్జాదారులు తమపై దాడులు చేస్తున్నారని వారు వాపోయారు.  2016లోనే ఈ ఇళ్ల కోసం ఒక్కో లబ్ధిదారుడు రూ.80,250 చెల్లించామని చెప్పారు. 15 రోజుల్లో లో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల లు కేటాయించకపోతే ప్రగతి భవన్ ముట్టడి కూడా వెనుకాడబోమని బాధితులు హెచ్చరించారు. నాయకులు,అధికారుల నిర్లక్ష్యం  వల్ల 512 కుటుంబాలు రోడ్డుపాలు అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన పేద కుటుంబాలను ఇప్పటికైనా గుర్తించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాధితులు విన్నవించారు.

Related Posts