YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గాంధీలో నాన్ కొవిడ్ సేవలు

 గాంధీలో నాన్ కొవిడ్ సేవలు

హైదరాబాద్, జూన్  30, 
కరోనా ఉధృతి నేపథ్యంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సెకండ్‌ వేవ్‌ లో కూడా కరోనా నోడల్ కేంద్రం గా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు సాధారణ సేవలకు సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి నాన్ కొవిడ్ సేవలను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ గాంధీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో బాధితులకు కరోనా ట్రీట్మెంట్ అందించగా.. మిగతా ప్రభుత్వ ఆసుపత్రులలో కొవిడ్ తో పాటు నాన్ కొవిడ్ సేవలను కూడా అందించింది వైద్య ఆరోగ్యశాఖ.ఇప్పుడు, తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ గాంధీ ఆసుపత్రిలో జనరల్ ఒపి సేవలతోపాటు, మిగతా అన్ని రోగాలకు ట్రీట్మెంట్ ఇచ్చేలా అనుమతి ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా కేసులు తగ్గడంతో కరోనాతో పాటు జనరల్ ట్రీట్మెంట్ ను కూడా అందిస్తున్నారు.మరో వారం రోజులో గాంధీ ఆసుపత్రి లో రెగ్యులర్ చికిత్స అందించనున్నామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి రమేష్ రెడ్డి చెప్పారు. తెలంగాణ లో ప్రస్తుతం రోజూ వేయికి తక్కువగా కరోనా కేసులు నమోదవ్వడం, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు.

Related Posts