YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు తెలంగాణ

మినీ ప‌వ‌ర్ లూమ్‌పై చేనేత కార్మికుడి అద్భుతాలు

మినీ ప‌వ‌ర్ లూమ్‌పై చేనేత కార్మికుడి అద్భుతాలు

రాజ‌న్న సిరిసిల్ల జూలై 4,
తెలంగాణ‌లోని సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హ‌రిప్ర‌సాద్ (31) మినీ ప‌వ‌ర్ లూమ్‌పై అద్భుతాలు సృష్టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. నేత‌ల ముఖ చిత్రాల‌తో పాటు ఉంగరంలో దూరేచీరను నేసి ఆక‌ట్టుకున్నాడు. ఆదివారం సీఎం కేసీఆర్ సిరిసిల్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. బ‌హుమ‌తిగా ఇచ్చేందుకు బుల్లిమ‌గ్గంపై నేస్తున్న కేసీఆర్, కేటీఆర్ చిత్ర‌ప‌టాలు ఆక‌ట్టుకుంటున్నాయి.5 కేజీల బ‌రువున్న ఈ మ‌గ్గాన్ని త‌యారు చేసేందుకు హ‌రి ప్ర‌సాద్‌కు 20 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. దీని త‌యారీకి రూ. 10 వేలు ఖ‌ర్చు కాగా, దాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయ‌కుడు భ‌రించారు. మొత్తంగా ఆదివారం సిరిసిల్ల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే సీఎం కేసీఆర్‌కు ప‌వ‌ర్ లూమ్‌తో పాటు హ‌రిప్ర‌సాద్ నేసిన చిత్ర ప‌టాల వ‌స్ర్తాన్ని బ‌హుక‌రించ‌నున్నారు.హరిప్రసాద్‌ పవర్‌లూమ్‌పై గ‌తంలో మూడు నెలల పాటు శ్రమించి అతి సూక్ష్మమైన దారం పోగులతో సూదిలో దూరిపోయే సన్నని చీరను తయారు చేశాడు. 6.50 మీటర్ల పొడవున్న సిల్క్‌చీరను 50 గ్రాముల బరువుతో నేశాడు. సునాయాసంగా చీరసూదిలో నుంచి దూరిపోతుంది.గతంలో ఉంగరంలో దూరేచీరను 6.50 మీటర్ల పొడవు, 450 గ్రాముల బరువుతో పట్టు చీరను పవర్‌లూమ్‌పై నేసి రికార్డు సృష్టించాడు. మరో ప్రయత్నంగా సిల్క్, మోనోబ్రైట్‌ పోగులతో చీరను మరమగ్గంపై నేశాడు. తొలి ప్రయత్నం విఫలమైనా.. రెండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. వెంట్రుక అంతటి సూక్ష్మదనంతో ఉండే పోగులను జాగ్రత్తగా పొందుపరిచి 6.50 మీటర్ల పొడవైన చీరను తయారు చేశారు.పదోతరగతి వరకు చదువుకున్న హరిప్రసాద్‌.. మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2014లో బుల్లిమగ్గం, వార్పిన్, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారు చేసి శభాష్‌ అనిపించుకుంటున్నారు. 

Related Posts