YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు ఆంధ్ర ప్రదేశ్

క్రికెట్ ఆడిన సీఎం జగన్

క్రికెట్ ఆడిన సీఎం జగన్

క్రికెట్ ఆడిన సీఎం జగన్
కడప
సీఎం జగన్ కడప జిల్లా టూర్లో అరుదైన దృశ్యం కనిపించింది. వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో క్రికెట్ ఆడారు ముఖ్యమంత్రి. సొంత జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్న సీఎం.. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థా పన చేశారు. అనంతరం.. సరదాగా స్టేడియంలో క్రికెట్ ఆడారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బౌలింగ్ చేయగా… సీఎం జగన్ బ్యాటింగ్ చేశారు. బౌండరీలు బాదకపోయినా.. మంచి షాట్లే ఆడారు ముఖ్యమంత్రి. 14 ఏళ్ళ క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షలతో 2007లో స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో స్టేడియం నిర్మాణం 2010 లో పూర్తయ్యింది.. ఇప్పటికే ఇక్కడ క్రికెట్ క్రీడాకారులకు శిక్షణ తో పాటు రంజీ క్రికెట్ మ్యాచులు నిర్వహిస్తున్నారు.. భవిష్యత్తులో డే నైట్ మ్యాచుల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటుకు బీసీసీఐ నిర్ణయించింది.. రూ. 4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Related Posts