
ఇద్దరు కంటే పిల్లలు ఉంటే నో గవర్నమెంట్ జాబ్
లక్నో, జూలై 10,
జనాభా నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. దీని కోసం ఓ ముసాయిదాను తయారు చేసింది. ఇద్దరి కన్నా ఎక్కువ సంఖ్యలో పిల్లలు కన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోనున్నారు. అలాంటి తల్లితండ్రులకు ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉండదు. ప్రభుత్వం చేపట్టే ఎటువంటి సంక్షేమ సౌకర్యం కూడా అందదు. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వీలు ఇవ్వరు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లోనూ వాళ్లు పోటీపడే ఛాన్సు లేదు. ఇలాంటి ప్రతిపాదనలతో ముసాయిదాను తయారు చేశారు. యూపీ జనాభా బిల్లు 2021పై ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు జూలై 19వ తేదీ వరకు సమయాన్ని కేటాయించారు. ఆ ముసాయిదాతో కేవలం ముస్లింలను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నా.. వచ్చే ఏడాది యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇది ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బహుభార్యత్వం విషయంలో వేరు వేరు సంతానాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు.