YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

రాణి పద్మావతి వాస్తవ చరిత్ర

రాణి పద్మావతి  వాస్తవ చరిత్ర

రాణి పద్మావతి పరాక్రమ, యదార్ధ వాస్తవ చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం..భారతీయరాజుల ధర్మనీతిక, అనైక్యత్య కారణంగా విదేశీయుల పాక్షింకంగా విజయం సాధించారు.సింహళ రాజ్య (శ్రీలంక ) రాజు సమ్మాన్ సింగ్ జి వారి కుమార్తె రాణి పద్మిని. 
రాణి పద్మిణి ఒక వీర వణిత. ఆమె అందం వర్ణనాతీతం.మహా యోధురాలు యుద్ధ నైపుణ్యరాలు. 
ఆమెతో ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వారితో వివాహం చేసుకుంటాను అని వారి నాన్న గారి తో చెపుతుంది. స్వయంవరం లో ఎంతో మంది రాజులతో యుద్ధం చేసింది కానీ ఆమె ను ఎవరు ఓడించలేదు. 
చివరకు రాణ రతన్ సింగ్ సమ వుజ్జిగా ఆమెతో నిలవడం తో వారి వివాహం జరిగింది. 
మేవార్ రాజ్యం ను రాణా రతన్ సింగ్ పాలిం చేవాడు. 
మేవార్ యొక్క కోట 7 వ శతాబ్దంలో నిర్మించిన శత్రు దుర్బేధ్యమైన రక్షణ కోట. 
700 ఎకరాల ఈ కోటను భయంకరమైన దాడుల మరియు సుడిగాలులల నుండి కాపాడుట కోసం దృడంగా నిర్మించారు. విదేశీ దురాక్రమణదారుడైన, అల్లాఉద్దీన్ ఖిల్జీ…
 తన తండ్రి మరియు మామయ్య జలాల్-ఉద్-దిన్ ఖిల్జీని హతమార్చి ఢిల్లీ పీఠం ను ఆక్రమించిన కీచకుడు.
ఎందరో ధన మాన ప్రాణాలను హరించిన రాక్షసుడు. నవయువకులను సైతం లైంగిక బానిసలుగా మార్చుకున్నాడు అంటే వీడి చరిత్ర ఎంతటి దుర్మార్గమైనదో తెలుస్తుంది.
చారిత్రాత్మక ఆధారాల ప్రకారం, తన నివాసంలో అనేక వేల మంది నవ యువకులను అతని వద్ద ఉంచుకున్నాడు. 
మాలిక్ కఫూర్ అనే ఒక అందమైన నపుంసకుడు ఉండేవాడు. గుజరాత్ దండయాత్ర సందర్భంగా ఖిల్జీ 1000 దీనార్లు చెల్లించి మాలిక్ కఫూర్ను కొనుగోలు చేశాడు. ఖిల్జీ యొక్క బలహీనతను సానుకూలంగా తీసుకొని, కఫూర్ ముఖ్య సలదారుగా అధికారం చెలాయించేవాడు. పూర్తి ప్రయోజనాన్ని పొందేవాడు. తన పుస్తకం తారిఖ్ -ఇ ఫిరుజ్ షాహిలో అళుద్దిన్ ఖిల్జీ మరియు మాలిక్ కఫూర్ల మధ్య శృంగార సంబంధం గురించి చరిత్రకారుడు "జియాదుద్దీన్ బరనీ" ప్రస్తావించారు. సూక్ష్మంగా ఇదీ ఖిల్జీ కధ.

రాణి పద్మావతి అందాల గురించి ఖిల్జీ చాలా విన్నాడు. ఆమె తన భార్య గా చే సుకోవాలని కోరుకున్నాడు. జనవరి 1303 లో అతను చితౌడ్ కోట సమీపంలో లక్షల భారీ సైన్యంతో కవాతు చేసాడు.
కోట చుట్టూ బలమైన రక్షణ ఏర్పాటు చూసి తన ఆత్మ స్థైర్యం సన్నగిలింది.
ఖిల్జీ సైన్యం యొక్క బలాన్ని గుర్తించిన రాణా రతన్ సింగ్, యుద్ధాన్ని ఎలా నివారించాలో ఆలోచిస్తున్నాడు.
ఈ లోపల ఖిల్జీ పన్నాగం పన్నాడు.ఒకసారి రాణి పద్మిని చూసి నేను (ఖిల్జీ) సైన్యంతో ఢిల్లీకి తిరిగి వెల్తానని, చితౌడ్ కోటకు అనుమతించినట్లయితే అని ఒక దూతను పంపించాడు. రాణి పద్మావతి ఆలోచన చేసింది. ఖిల్జీ తన రూపం ను ప్రతిబింబంలో ( అద్దంలో ) మాత్రమే చూడగలిగిన ఒక నిబంధన ను పెట్టిఅంగీకరించింది. ఖిల్జీ ఆమె నిబంధనను ఒప్పుకున్నాడు. అతను తన విశ్వసనీయ సైన్యాధికారులతో వచ్చాడు. మహా అందమైన పద్మావతి యొక్క ప్రతిబింబం చూస్తూ, ఖిల్జీ నిశ్చేష్టుడయ్యాడు. ఆమెని ఎలాగైనా పొందాలని కోరిక ను 
బలంగా పెంచుకున్నాడు.రతన్ సింగ్ అతన్ని కోట యొక్క గేటు వరకు మర్యాదకు పూర్వకంగా వెళ్ళాడు ఖిల్జీ తన శిబిరానికి క్షేమంగా వెళ్ళాడు. కాని ఇక్కడ ధర్మనీతి చుడండి. అయితే ఈ సమయంలోనే ఖిల్జీ కపటంగా, మోసంగా, అధర్మంగా రతన్ సింగ్ ను ఖైదీగా చేసాడు. మరియు అతని శిబిరంలో ఖైదుగా బందించాడు. రాజుకు బదులుగా రాణి పద్మావతిని పంపించాలని ఆజ్ఞాపించాడు చితౌడ్ కోటకు ఒక సందేశం పంపాడు. యుద్ధ నీతి తెలిసిన, ధైర్యవంతురాలైన చమత్కారమైన పద్మావతి ఒక ప్రణాళికను రూపొందించింది.
ఆమె ఖిల్జీ కి ఒక వర్తమానం పంపారు, ఉదయం ఆమె శిబిరానికి పల్లకిలో వస్తాను అని కబురు పంపించింది. రాణి ఉదయం ఖిల్జీ యొక్క శిబిరానికి ఆయుధాలతో సహా పలువురు సైనికులతో పాటుగా గోర మరియు బాదల్ అను ఇద్దరు ప్రముఖ సైన్యాధికారుల తో బయలు దేరింది .(80 ఏళ్ల గోర ,బాదల్, మరియు జలాల చౌహాన్ వంశీయుడికి చెందిన చచా-భాటియా ఈ సమూహంలో  ఉన్నారు. రాజస్థాన్ చరిత్రలో, వారి పేర్లు స్వర్ణ అక్షరాలలో రాయబడ్డాయి. పండిట్ నరేంద్ర మిశ్రా ఒక పద్యం ద్వారా గోర మరియు బాదల్ కు అద్భుతమైన నివాళి అర్పించారు) సైనికులు మహిళల మారువేషంలో, కొన్ని పల్లకిలలోకూర్చుని మిగిలిన 200పల్లకిలలో బోయవారు పాత్రలో వెళ్లటం జరిగింది. ఈ శిబిరాన్ని చేరుకున్నప్పుడు, గోర స్వయంగా రతన్ సింగ్ గుడారానికి వెళ్లారు మరియు ఖిల్జీ సైన్యాన్ని నివారించటానికి మరియు రాజుని రక్షించడానికి బాదల్ ను కోరాడు.

ఖిల్జీ యొక్క గుడారం వద్ద గోర పల్లకిల డోరాల ను తొలగించారు. గోరా ఖిల్జీ చంపడానికి వెళ్ళాడు, కానీ విఫలమయ్యాడు. ఖిల్జీ ఒక పిరికిపందలా ఆడవాళ్ళ వెనుక దాక్కున్నాడు. భారతీయ యోధులు ఎప్పుడూ మహిళలపై దాడి చేయరు.(ఇక్కడ ధర్మనీతి చుడండి) ఖిల్జీ తప్పించుకున్నాడు. ఇంతలో, ఖిల్జీ సైన్యం అక్కడికి చేరుకుంది మరియు భీకర పోరాటం ప్రారంభమైంది. రాణ రతన్ సింగ్ రక్తపు మడుగులో ఉన్నాడు. రణ రతన్ సింగ్ ను రక్షించారు. గోర మరియు బాదల్ మరియు దాదాపు అంత రాణ సైన్యం వారి జీవితాలను త్యాగం చేశారు. చితౌడ్ కోటకు కొద్ది మంది సైన్యం తో చేరుకున్నారు.
ఖిల్జీ మరింత రెచ్చిపోయాడు
ఖిల్జీ అన్ని వైపులా చితౌడ్ కోటను ముట్టడి చేశాడు. అన్ని గేట్లు మూసివేయబడ్డాయి. ఇది ఆగస్టు వరకు కొనసాగింది (జనవరిలో ప్రారంభమైంది). నిల్వ చేయబడిన ఆహార పదార్థాలు పూర్తిగా క్షీణించబడ్డాయి. ఆగష్టు 26 న, 1303, రతన్ సింగ్ తన సైన్యంతో, కాషాయ తలపాగాలను ధరించి, శత్రువులపై ఆత్మ ఆహుతి దాడి చేసాడు. వారి లక్ష్యం కోటను రక్షించడం లేదా చనిపోవడం. తరువాత జరిగిన యుద్ధంలో, వారు అందరు వీర మరణం పొందారు. 
"రాణి పద్మావతి" యొక్క ఉత్తర్వుల ప్రకారం కోటలో భారీ చితి ని ఏర్పాటు చేసింది. రాణి పద్మావతి మరియు ఆమె సహచరులు, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి, క్రూరమైన శత్రువుల చేతుల్లో అగౌరవంగా ఉండకుండా, జౌహర్ ను (సతి సహగమనం చేసుకున్నారు) ప్రదర్శిస్తూ, చితిలోకి ప్రవేశించారు. దాదాపు 30,000 వేల మంది రాజ్ పుత్ మహిళలు మంటల్లో మరణించారు.
ఖిల్జీ మరియు అతని దళాలు ఈ కోటలోకి ప్రవేశించాయి, ధైర్యంగల రాజపుత్రికల మృతదేహాలు యొక్క బూడిదతో మాత్రమేఎదుర్కోవలసి వచ్చింది. జౌహర్( సతి సహగమనం చేసుకున్నారు) ప్రదర్శన, వారు మరణించారు కానీ వారికి చరిత్ర మరియు జానపదాలలో అమరత్వం ఉంది. ఇది చరిత్ర. స్వాభిమాన దేశభక్త భారతీయునికి ఆంగ్లేయ బుద్దిజీవులకు మధ్య పోరాటమే పద్మావతి సినిమా. అయితే నిజాన్ని నిజంలా కాకుండా జాతిని, చరిత్రను అవమానపరిస్తే అది క్షమించరాని నేరం. 
రాజ్ పుత్ వంశీయులు సినిమా పట్ల తమ నిరసనను గట్టిగా వినిపిస్తున్న తరుణంలో సినిమాలో పద్మావతి చరిత్రను వక్రీకరించడం లేదని తెలుపటానికి వారిరి ఒక ప్రివ్యూ షో వేసి వివాదాన్ని సరిచేయొచ్చు.
"ఏ దేశమేగినా ఎందు కాలడిన పొగడరా ని తల్లి భూమి భారతి నిలపర ని జాతి నిండు గౌరవం" అనే మాటను మరువకుండా డైరక్టర్ లు తమ సినిమాలు తీయాలి.

Related Posts