YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నీటిపంపకాల్లో మా పని మేం చేస్తాం కేంద్రమంత్రి షేకావత్

నీటిపంపకాల్లో మా పని మేం చేస్తాం కేంద్రమంత్రి షేకావత్

న్యూఢిల్లీ
కేంద్ర జనవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బెంగళూరు వచ్చారు. మంగళవారం బెంగళూరులోని విధాన సౌదలో జల జీవన్ మిషన్ ప్రాజెక్టు విషయాలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేకదాటు ప్రాజెక్టు విషయంతో పాటు నీటి పంపకాల విషయంలో చర్చ జరిగింది. ఈ అత్యున్నత సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడారు.  నీటి పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ, అక్కడ కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలు ఫైటింగ్ చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక-తమిళనాడు మద్య వివాదానికి కారణం అయిన మేకదాటు ప్రాజెక్టు విషయంలో మా పని మేము చేస్తామని, ఇక్కడ తారతమ్యాలు, పక్షపాతదోరణి ఉండదని కేంద్ర జనవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కర్ణాటకలో మా పార్టీ వాళ్లు అధికారంలో ఉన్నారని, తమిళనాడులో మా పార్టీ అధికారంలో లేదని తేడా ఏమీ ఉండదని, నీటి పంపకాల విషయంలో మా పని మేము చేస్తామని, మా మీద ఎవ్వరు ఒత్తిడి చేసినా మేము ఏ మాత్రం పట్టించుకోమని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.
తమిళనాడు సరిహద్దులోని కర్ణాటక ప్రభుత్వం మేకదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి సిద్దం అయ్యింది. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మేకదాటు ప్రాజెక్టు విషయంలో తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి.
కావేరి నీటి పంపిణి విషయంలో దశాభ్దాల కాలంగా తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల మద్య వివాదం ఉంది. ఇప్పుడు మేకదాటు ప్రాజెక్టు నిర్మిస్తే కావేరీ నిటి పంపిణి విషయంలో మాకు అన్యాయం జరుగుతోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. బెంగళూరు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలంటే మేకదాటు ప్రాజెక్టు నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది.
కర్ణాటక-తమిళనాడు మద్య వివాదానికి కారణం అయిన మేకదాటు ప్రాజెక్టు విషయంలో మా పని మేము చేస్తామని, ఇక్కడ తారతమ్యాలు, పక్షపాతదోరణి ఉండదని కేంద్ర జనవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కర్ణాటకలో మా పార్టీ వాళ్లు (బీజేపీ) అధికారంలో ఉన్నారని, తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో ఉందని, అక్కడ మా పార్టీ లేదని తేడా ఏమీ ఉండదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. మేకదాటు ప్రాజెక్టు నిర్మాణం, కావేరీ నీటి పంపకాల విషయంలో మా పని మేము చేస్తామని, మా మీద ఎవ్వరు ఒత్తిడి చేసినా మేము పట్టించుకోమని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చి చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి పంపిణి విషయంలో ఇద్దరికి న్యాయం చేస్తామని. కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేస్తోందని, ఇక్కడ ముసుగులో గుద్దులాట ఏమీ ఉండదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రెండు రాష్ట్రాలకు నీటి బొట్టు విషయంలో తేడా మాత్రం రాదని, ఎవరివాటాలు వాళ్లకు వచ్చే విదంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ క్లారిటీ ఇచ్చేశారు.

Related Posts