YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

చాప కింద నీరులా వైరస్

చాప కింద నీరులా వైరస్

చాప కింద నీరులా వైరస్
హైదరాబాద్, జూలై 15,
రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. జనం కొవిడ్రూల్స్పక్కన పెట్టేయడంతో ఇదే అదనుగా వైరస్ తన పని తాను చేసుకుపోతోంది. మిగిలిన జిల్లాల సంగతి ఎలా ఉన్నా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ తర్వాత కనీస జాగ్రత్తలను గాలికి వదిలేయడం, పార్టీలు, ఫంక్షన్లంటూ హడావుడి చేయడం, శుభ, అశుభ కార్యాలకు పరుగులు తీయడం లాంటి కారణాలతో ఈ జిల్లాల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజుకు 300 పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో కేంద్రం ప్రకటించిన అత్యధిక పాజిటివిటీ ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్టయి కేసుల కట్టడిపై దృష్టిపెట్టారు. మొన్నటి వరకు ఏపీ సరిహద్దుగా ఉన్న మండలాల్లోనే ఎక్కువగా కేసులు వస్తున్నాయని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆ తర్వాత  ఇతర మండలాల్లో కూడా కేసులు పెరగడాన్ని గుర్తించారు. ఖమ్మం సిటీతో పాటు కామేపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, చింతకాని మండలాల్లోనూ పెద్ద సంఖ్యలో కేసులు వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఫంక్షన్ల పేరుతో వందలాది మంది ఒక్కచోటుకు చేరడం, మందు పార్టీలు, దావత్ లు చేసుకోవడం వల్లే వ్యాప్తి పెరిగిందని ఆఫీసర్లు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో 584 గ్రామాలుండగా, పట్టణాలు, గ్రామాల్లో కలిపి 1,300కు పైగా టీమ్ లను ఏర్పాటు చేశారు. వాళ్ల ద్వారా ఇంట్లో ఎంత మందికి జ్వరం, జలుబు, ఇతర కోవిడ్ లక్షణాలున్నాయో తెలుసుకుంటున్నారు. ఊళ్లలో ఎక్కడైనా పదికి పైగా యాక్టివ్ కేసులు నమోదైతే ఆ గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం సిటీలో రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా కరోనా వ్యాప్తికి కారణమయ్యాయన్న విమర్శలున్నాయి. ఏప్రిల్ 30న  పోలింగ్ జరగ్గా, మే 3న ఫలితాలు రిలీజయ్యాయి. ఆ టైంలో వందల సంఖ్యలో జనం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ర్యాలీలు, సభలంటూ రోడ్లపై తిరగడం కామన్ అయింది. అప్పుడు కరోనా బారిన పడ్డ చాలామంది ఇంట్లో కుటుంబ సభ్యులకు అంటించారు. ఆ తర్వాత కూడా కేసుల సంఖ్య కంట్రోల్ కాకపోవడానికి ఎన్నికలే కారణమయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో 40 పీహెచ్సీలు ఉండగా 21 పీహెచ్సీల పరిధిలో కరోనా ఉధృతి కనిపిస్తోంది. అర్బన్ ఏరియాల్లోని ఆరు సెంటర్లలో 545, రూరల్ ఏరియాల్లోని 15 పీహెచ్సీల పరిధిలో 1591 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆయా చోట్ల పాజిటివిటీ రేటు 2 నుంచి 7.5 దాక నమోదవుతోంది. ఇది క్రమంగా పెరుగుతుండడంతో ఆఫీసర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. రెండు రోజుల క్రితం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ హెల్త్ ఆఫీసర్లతో రివ్యూ చేశాక ఇంటింటి ఫీవర్ సర్వే ప్రారంభించారు. రెండు రోజులపాటు చేసిన సర్వేలో ఇప్పటివరకు 1,912 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశారు. ప్రధానంగా నల్గొండ, మిర్యాలగూడ డివిజన్లలో కరనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మిర్యాలగూడ డివిజన్కు ఏపీ బార్డర్తో లింక్ఉన్నందునే వైరస్ వ్యాప్తి ఎక్కువుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న పీహెచ్సీల పరిధిలోనే కొత్తగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయని హెల్త్స్టాఫ్చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే థర్డ్వేవ్ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

Related Posts