
హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
చంఢీఘర్ జూలై 15
హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. దత్తాత్రేయ చేత హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవి శంకర్ ఝా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు చీఫ్ జస్టిస్ రవి శంకర్, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శుభాకాంక్షలు తెలిపారు. 2019లో దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ బదిలీ అయిన సంగతి తెలిసిందే.