
న్యూఢిల్లీ
కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వారం రోజులుగా విమానచోదకునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పూర్వాశ్రమంలో పైలెట్గా పనిచేశారు. ఆయనకు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉంది. కాగా ఎయిర్బస్-320 నడిపిన ఎంపిగా ఇప్పుడు ఆయన రికార్డులకెక్కారు. గత వారం తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్ని విమానంలో చెన్నైకి తీసుకెళ్లిన రాజీవ్ ప్రతాప్ రూడీ, తాజాగా బీజేపీ నేతలతో పాటు మరి కొందరు ఎంపీల బృందాన్ని తన నేతృత్వంలో విమానయానం చేయించారు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ప్రయాణంలో ఉన్నవారిలో ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, ఆయన కుమార్తె ఆరు నెలల చిన్నారి అయిన సాన్విక కూడా ప్రయాణించగా, ఆ పాపకు స్వాగతం చెబుతూ ఓ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ. ఈ వీడియోకు లైక్ల వర్షం కురుస్తోంది.