YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

ప్రాణాంతకం కానున్న మంకీ బి వైర‌స్‌..

ప్రాణాంతకం కానున్న మంకీ బి వైర‌స్‌..

న్యూ డిల్లీ జూలై 19,    మరో వైరస్ మంకీ బి వైర‌స్‌..పొంచి చూస్తుంది. తాజాగా చైనాలో దీని కార‌ణంగా తొలి మ‌ర‌ణం సంభ‌వించడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ 53 ఏళ్ల వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ఈ వైర‌స్ బారిన ప‌డి మృత్యువాత ప‌డ్డారు. ఈ ఏడాది మార్చిలో రెండు చ‌నిపోయిన కోతుల‌ను ముట్టుకోవ‌డం ద్వారా ఆయ‌న‌కు ఈ వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. నెల రోజుల త‌ర్వాత క‌డుపులో వికారం, వాంతులు మొద‌ల‌య్యాయి. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా.. మే 27న ఆయ‌న చ‌నిపోయారు. ఈ నేప‌థ్యంలో ఈ కొత్త వైర‌స్ ఏంటి? ఇది ఎంత ప్ర‌మాద‌క‌రం? మ‌రో మ‌హమ్మారిగా మారుతుందా అన్న అంశాల‌ను ఒక‌సారి పరిశీలిస్తే ఇది కొత్త‌దేమీ కాదని,తొలిసారి ఈ బీ వైర‌స్ కార‌ణంగా 1933లోనే ఓ లేబొరేట‌రీలో ప‌ని చేసే వ్య‌క్తి చ‌నిపోయారు. ఆ వ్య‌క్తిని ఓ కోతి క‌రిచింది. ఆ త‌ర్వాత దానిని నుంచి కోలుకున్నా.. కొన్ని రోజుల త‌ర్వాత జ్వ‌ర సంబంధ‌మైన వ్యాధి బారిన ప‌డ్డారు. మెల్ల‌గా అసెండింగ్ మైలిటిస్ (నాఢీ సంబంధిత‌) వ్యాధి ల‌క్ష‌నాలు క‌నిపించి, 15 రోజుల త‌ర్వాత మృత్య‌వాత ప‌డ్డారు.ఇది మ‌నిషి నుంచి మ‌నిషికి నేరుగా తాక‌డం, వైర‌స్ సోకిన వ్య‌క్తి స్ర‌వాలు అవ‌త‌లి వ్య‌క్తిలోకి వెళ్ల‌డం ద్వారా సోకుతుందని తేలింది. 1933లో తొలిసారి ఈ మాకాక్యూ బి ఇన్ఫెక్ష‌న్ బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ 20 మందికిపైగా మృత్యువాత ప‌డ్డారు. వీళ్ల‌లో ఐదుగురు గ‌త 12 ఏళ్ల‌లోనే చ‌నిపోయారు. వీళ్ల‌లో చాలా మంది కోతి క‌ర‌వ‌డం లేదా గీర‌డం లేదా చ‌ర్మంపై ఏర్ప‌డిన గాయం ద్వారా కోతి క‌ణ‌జాలం లేదా స్ర‌వాలు శ‌రీరంలోకి వెళ్ల‌డం ద్వారా ఈ వైర‌స్ బారిన ప‌డ్డారు.ఇది మ‌నిషికి సోకినప్పుడు ప్ర‌ధానంగా కేంద్ర నాఢీ వ్య‌వ‌స్థ‌పైనే దాడి చేస్తుంద‌ని అమెరికాకు చెందిన నేష‌న‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ మెడిసిన్ వెల్ల‌డించింది. దీని బారిన ప‌డి వాళ్ల‌లో 70 నుంచి 80 శాతం మంది మ‌ర‌ణించారు. వైర‌స్ సోకిన త‌ర్వాత 1-3 వారాల్లోపు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వీటిలో ప్ర‌ధానంగా ఫ్లు వైర‌స్ ల‌క్ష‌ణాలైన జ్వ‌రం, చ‌లి, కండ‌రాల నొప్పి, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి క‌నిపిస్తాయి.ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి అంత సులువుగా ఇది సోక‌దని, దీని వ్యాప్తి వేగం త‌క్కువేనని, ఇది మ‌హ‌మ్మారిగా మారే అవ‌కాశాలు త‌క్కువ అని పరిశోదనల్లో తేలింది.

Related Posts