.jpg)
మోడీ అన్నింటిని కాలరాస్తున్నారు
లక్నో, జూలై 19,
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ స్పైవేర్‌ను ప్రభుత్వం వాడుతోందన్న వార్తలు నిజమైతే గోప్యత హక్కుపై మోదీ ప్రభుత్వం నేరుగా భీకర దాడిని ప్రారంభించిందని ప్రియాంక సోమవారం ట్వీట్ చేశారు. పెగాసస్‌పై వెల్లడైన విషయాలు నీతిబాహ్యమైనవని, ఇవి రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన గోప్యత హక్కుపై ప్రభుత్వం దాడి చేయడమేనని ప్రియాంక పేర్కొన్నారు. మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఇది భంగరమని వ్యాఖ్యానించారు. పెగాసస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. మీరేం చదువుతున్నారో మాకు తెలుసు..ఫోన్‌లో మీ కదలికలు సహా అన్నీ తెలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.భారత్‌లో పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులపై నిఘా కోసం వారి ఫోన్లను పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేశారనే అంశంపై చర్చించాలని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజు పలువురు విపక్ష నేతలు పట్టుబట్టారు. భారత్‌లో ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నేతలు, విపక్ష నేతలు, కొందరు కేంద్ర మంత్రులు సహా దాదాపు 300 మంది ఫోన్లను హ్యాక్ చేశారని ఆదివారం వెల్లడైన ఓ నివేదిక కలకలం రేపింది.