YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆషాఢ శుక్ల ఏకాదశి* తొలి ఏకాదశి. (శయన ఏకాదశి)

ఆషాఢ శుక్ల ఏకాదశి* తొలి ఏకాదశి. (శయన ఏకాదశి)

????️ ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు. శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు. చాతుర్మాసం లో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అంటారు.*

*????️ శయన ఏకాదశి అనే పేరు విన్నంత మాత్రం చేతనే మన మహా పాపములు నశించి పోతాయి, అంతటి మహా మహిమ కలిగిన ఏకాదశి ఇది.*

*????️ పూర్వము కృతయుగము చివరి పాదములో ప్రహ్లాదుని మనుమడు విరోచన పుత్రుడు అయిన బలి చక్రవర్తి గురువుగారు శుక్రాచార్యుని కటాక్షంతో విశ్వజిత్ అనే యజ్ఞం చేసి, మహా శక్తులు పొంది, స్వర్గం మీదకు దండెత్తి వెళ్ళి, దేవతల స్వర్గమును ఆక్రమించుకుని, అక్కడ తన ప్రతినిధులను పెట్టి భూలోకంలో నర్మదా నది తీరంలో యాగములు చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి మూడడుగులు దానముగా పుచ్చుకుని బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి వేశాడు.* 

*పాతాళానికి వెళ్ళిన బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును నువ్వు నా దగ్గర ఒక రూపంతో ఉండాలి అని భక్తితో ప్రార్థించగా స్వామి వారు సరే నీ కోసము ఒక నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకొని నీ దగ్గర ఒక రూపంతో ఉంటాను అని తన రూపాన్ని రెండుగా విభజించుకున్నాడు. అందులో ఒక రూపమును బలి చక్రవర్తి దగ్గర పాతాళంలో ఉంచాడు, మరొకటి క్షీర సముద్రంలో ఉంచాడు. ఈ విధముగా స్వామివారు రెండు రూపములను ధరించిన అపూర్వమైన తిథియే శయన ఏకాదశి.*

*????️ బలి చక్రవర్తి స్వామివారిని స్వామీ నువ్వు ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తిక శుక్ల ఏకాదశి వరకు పాతాళ లోకంలో ఉన్న రూపంతో మెలకువగా ఉండి, క్షీర సాగరం లో ఉన్న రూపం నిద్రపోతూ ఉండాలి, ఈ  నాలుగు నెలలు మా పూజలు అందుకోవాలి, ఈ సమయంలో ఎవరైనా భక్తులు నిన్ను పూజిస్తే నా లోకంలో మెలకువతో ఉన్న రూపంలో నుండి వెళ్లి ఆ భక్తులను అనుగ్రహించాలి అని కోరగా స్వామి వారు అలాగే అని బలిచక్రవర్తికి వరమిచ్చాడు.* 

*????️ తద్వారా ప్రజలందరూ ఈ విషయం విని స్వామి వారు పాతాళలోకంలోని బలిచక్రవర్తి దగ్గర నుంచి వచ్చారు, ఈ విధముగా నన్ను కూడా తలుచుకుంటారు, దాని వలన నా పుణ్యం పెరిగి ఎల్లప్పుడూ నీ సేవ చేసుకునే భాగ్యం లభిస్తుంది అన్నాడు.*

*ఈ విధముగా ప్రజలందరూ ఆ వంకతో నిన్ను కూడా తలుచుకోవడం వల్ల నీ పుణ్యం అఖండంగా పెరిగి రాబోయే సావర్ణి మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు, ఆ తర్వాత శాశ్వతంగా నా లోకానికి వచ్చేస్తావు అని వరమిచ్చాడు.*

*????️ ఈ విధముగా బలిచక్రవర్తి కోరిక మేరకు స్వామి వారు వైకుంఠములో ఆదిశేషుని మీద నిద్ర పోవడం వలన ఈ ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు వచ్చింది.*

*????️ స్వామి వారు తన దివ్య లోకంలో నిద్రపోతూ ప్రజల కోసం అధో లోకములలో మెలకువగా ఉండడం వలన ఈ ఏకాదశి మిగిలిన వాటి కంటే విభిన్నమైనది.*

*ఆచరించవలసిన విధులు:* 

*????️  ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, భక్తితో హరిని పూజించి, తులసి దళములను స్వామివారికి సమర్పించిన వాడు ఎంతటి సామాన్యుడైనా, వాడి పాపములన్ని తొలగిపోయి సకల శుభములు పొందుతాడు.*

*????️ ఏకాదశి నాడు సూర్యోదయాని కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలారా స్నానం చేసి (మీరు స్నానం చేసే నీళ్ళలో రెండు తులసి దళములు, ఒక మారేడు దళం వేసుకుని స్నానం చేస్తే మీరు గంగా నది వంటి పుణ్య నదీ జలాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది) (ఆరోగ్యం సహకరించని వారు స్నానం చేసినా సరిపోతుంది). వారి వారి సంప్రదాయాలను అనుసరించి విభూతి కానీ, ఊర్ధ్వ పుండ్రాలు కానీ, కుంకుమ కానీ ధరించి భక్తితో హరి పూజ చేయాలి.* 

*????️ కటిక ఉపవాసం చేయకూడదు కనుక శరీరము నిలబడడానికి అవసరమైన మేర భుజించి ఉపవాసము చేసి ఈరోజు మహాత్ములకు దీపదానము (వెలుగుతున్న దీపం దక్షిణతో) చేయాలి.*

*????️ ఈరోజు మోదుగ ఆకులతో కుట్టిన విస్తరాకులో భోజనం చేయండి. పూర్తిగా మోదుగ ఆకులతో కుట్టిన విస్తరి దొరకని వాళ్ళు కంచంలో ఒక్క మోదుగాకు వేసుకొని అయినా దాంట్లో భోజనం చేయండి.*

*????️ ఈరోజు దీపదానము, మోదుగ ఆకులో భోజనం, హరిపూజ, హరి నామస్మరణ చేసిన వారు హరికి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారు.*

*????️ ఈ రోజు ఒకటి లేదా రెండు తులసి దళములను, ఒకటి లేదా రెండు మారేడు దళము లను తమలపాకులో పెట్టి కానీ లేదా వక్కలతో కలిపి కానీ దక్షిణతో మహాత్ములకు దానము చేస్తే అటువంటివాడు బలిచక్రవర్తి విష్ణువుకు మూడు అడుగులు దానము చేసి పొందిన మహా ఫలితాన్ని పొందుతారు.*

*????️ ఏకాదశి నాడు పగటిపూటనిద్ర, స్త్రీ సంగమం పనికిరాదు.*

*????️ భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఐకమత్యంతో ఉండండి.*

*????️ ఏకాదశి నాడు సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు అఖండ నామ సంకీర్తన చేయండి అటువంటి వారు సకల శుభాలను పొందుతారు.*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts