
అర్హతలేని రైతుల నుండి పీఎం కిసాన్ స్కీమ్ నగదు వసూల్
న్యూఢిల్లీ జూలై 20;:
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 42 లక్షల మంది అర్హతలేని రైతులకు కూడా ఆ స్కీమ్ ప్రకారం సుమారు మూడు వేల కోట్లు బదిలీ చేశారు. ఆ అమౌంట్‌ను మళ్లీ వసూల్ చేస్తున్నట్లు ఇవాళ పార్లమెంట్‌లో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం ప్రతి రైతుకు ఆరు వేలు ఇస్తున్నది. మూడు ఇన్‌స్టాల్‌మెంట్లలో ఆ అమౌంట్ ఇస్తున్నారు. అయితే ఆదాయ పన్ను కట్టే రైతులకు ఆ స్కీమ్ వర్తించదు. కానీ కొందరు రైతులకు నగదు ట్రాన్స్ ఫర్ అయ్యింది. వారి నుంచి సుమారు 2992 కోట్లు రికవర్ చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. అస్సాంలో 8.35 లక్షల మంది రైతుల నుంచి 554 కోట్లు వసూల్ చేయాల్సి ఉందన్నారు. పంజాబ్ నుంచి 437 కోట్లు, మహారాష్ట్ర నుంచి 358 కోట్లు, తమిళనాడు నుంచి 340 కోట్లు, యూపీ నుంచి 258 కోట్లు, గుజరాత్ నుంచి 220 కోట్లు వసూల్ చేయాలన్నారు.