YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోవిడ్ ఖర్చులు 60 వేల కోట్లు పైనే

కోవిడ్ ఖర్చులు 60 వేల కోట్లు పైనే

హైదరాబాద్, జూలై 22,
కోవిడ్ చికిత్స కోసం దేశ ప్రజలు ఎంత ఖర్చు పెట్టారనే విషయంపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా, అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. కరోనా టెస్టింగ్, ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చు పెట్టారనే దానిపై సర్వే నిర్వహించింది.కరోనా వైరస్ ఎన్నో కుటుంబాలన్ని ఛిద్రం చేసింది. నా అనే వారు లేకుండా చాలా మంది అనాథలయ్యారు. అయితే..ఈ దిక్కుమాలిన వైరస్ నుంచి బయటపడేందుకు ఎంతో మంది డబ్బులను భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కొంతమంది ఆస్తులను కూడా అమ్మేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. తాజాగా…కోవిడ్ చికిత్స కోసం దేశ ప్రజలు ఎంత ఖర్చు పెట్టారనే విషయంపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా, అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. కరోనా టెస్టింగ్, ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చు పెట్టారనే దానిపై సర్వే నిర్వహించింది. కోవిడ్ పరీక్షలు, చికిత్సల కోసం దేశ ప్రజలు ఏకంగా రూ. 64 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. అంటే..దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చేసిన అంచనా వ్యయం (రూ. 35 వేల కోట్లు) దీనికి దాదాపు రెట్టింపు ఖర్చు చికిత్సకు ఖర్చయ్యింది.కేవలం ఆసుపత్రి ఖర్చులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగిందని, ఆసుపత్రికి రాను..పోనూ..ఇతరత్రా ఖర్చలు, మరణాలు సంభవిస్తే..అంత్యక్రియలు తదితర ఖర్చులు లెక్కించలేదని సర్వేలో కీలకంగా వ్యవహరించిన శక్తివేల్ వెల్లడించారు. వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటే…మొత్తం వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా వైరస్ బారిన పడి..తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇందులో చికిత్స పొందిన కుటుంబాల పరిస్థితి చెప్పనక్కర్లేదు.జీతం పొందే ఉద్యోగుల తమ ఆదాయంలో 50 శాతాన్ని ఐసీయూ చికిత్సకు ఖర్చు చేశారని వెల్లడైంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ విషయంలో..వీరి సంవత్సర ఆదాయంలో 66 శాతం కోవిడ్ చికిత్స ఖర్చులకే సరిపోయింది. క్యాజువల్ వర్కర్స్ లో తమ్ వార్షిక ఆదాయంలో 86 శాతాన్ని కరోనా నుంచి బయటపడేందుకు ఖర్చు చేశారని నివేదిక వెల్లడించింది. 

Related Posts