YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

 టోక్యో లో చానుకు ఫస్ట్ మెడల్

 టోక్యో లో చానుకు ఫస్ట్ మెడల్

 టోక్యో లో చానుకు ఫస్ట్ మెడల్
టోక్యో, జూలై 24, 
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట మొదలైంది. శనివారం వెయిట్ లిఫ్టింగ్‌లో మణిపూర్‌కి చెందిన మీరాబాయి చాను దేశానికి రజత పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. స్నాచ్‌లో 87 కేజీలను లిప్ట్ చేసి.. క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలను లిప్ట్ చేయడం ద్వారా భారత్‌కి పతకాన్ని ఖాయం చేసింది. మొత్తంగా 202 కిలోలను మీరాబాయి లిప్ట్ చేయగా.. చైనా క్రీడాకారిణి జిహు ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ మొత్తంగా 210 కేజీలను లిప్ట్ చేసింది. ఇక ఇండోనేషియా లిప్టర్ ఆసిహ్ 194 కేజీలతో కాంస్యంతో సరిపెట్టుకుంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిప్టర్ కరణం మల్లీశ్వరి తొలిసారి కాంస్య పతకాన్ని భారత్‌కి అందించగా.. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మీరాబాయి వెయిట్ లిప్టింగ్‌లో పతకం కొరతని తీర్చింది.2016 రియో ఒలింపిక్స్‌లో క్లీన్ అండ్ జర్క్‌లో 103, 106 కేజీలను లిప్ట్ చేసేందుకు ప్రయత్నించి మీరాబాయి ఫెయిలైంది. కానీ.. 2017లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. గోల్డ్‌మెడల్ సాధించింది. అనంతరం 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ 48కేజీల విభాగంలోనే మీరాబాయి స్వర్ణం గెలవడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి కచ్చితంగా పతకం గెలుస్తుందని ఇటీవల దిగ్గజ వెయిట్‌ లిప్టర్ కరణం మల్లీశ్వరి జోస్యం చెప్పింది. తాజాగా అదే నిజమైంది.భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో‌ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ఇప్పటికే ప్రకటించేసింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది.

Related Posts