YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంప‌ర్ ఆఫ‌ర్

వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంప‌ర్ ఆఫ‌ర్

వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంప‌ర్ ఆఫ‌ర్
న్యూఢిల్లీ జూలై 27
ఒలింపిక్స్‌ లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఇండియాకు తిరిగి వ‌చ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ను క‌లిసింది. ఈ సంద‌ర్భంగా మీరాబాయిని ఆయ‌న‌ స‌న్మానించారు. అంతేకాదు రూ.2 కోట్ల న‌గ‌దు, ఈశాన్య రైల్వేలో ప్ర‌మోష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మీరాబాయి త‌న నైపుణ్యం, క‌ఠోర శ్ర‌మ‌, మొక్క‌వోని దీక్ష‌తో కోట్లాది మంది భారతీయుల‌లో స్ఫూర్తి నింపింద‌ని అశ్విని వైష్ణ‌వ్ అన్నారు. ఆమెను క‌ల‌వ‌డం, స‌న్మానించ‌డం సంతోషంగా ఉంద‌ని ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే ఈశాన్య రైల్వేలో ప‌ని చేస్తున్న ఆమెను ఇప్పుడు ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (స్పోర్ట్స్‌)గా ప్ర‌మోట్ చేశారు.

Related Posts