YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి
న్యూఢిల్లీ జూలై 27
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. 132 రోజుల తర్వాత 30వేలకు దిగువన కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 42,363 మంది బాధితులు కోలుకోగా.. మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.14కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 3,06,21,469 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 4,21,382 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు 97.39శాతానికి పెరిగిందని తెలిపింది. 124 రోజుల తర్వాత దేశంలో నాలుగు లక్షలకు దిగువన యాక్టివ్‌ కేసులు చేరాయి. ప్రస్తుతం 3,98,100కు చేరాయని, మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.27శాతం ఉన్నాయని పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.33శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.73శాతంగా ఉందని వివరించింది. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 45.91కోట్ల కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 44,19,12,395 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

Related Posts