YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

నో మాస్క్, నో సేల్, నో ఎంట్రీ, నో రైడ్ పై అవగాహన

నో మాస్క్, నో సేల్, నో ఎంట్రీ, నో రైడ్ పై అవగాహన

నో మాస్క్, నో సేల్, నో ఎంట్రీ, నో రైడ్ పై అవగాహన
నెల్లూరు
 స్థానిక డైకస్ రోడ్ సెంటర్ లో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్,పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జి ఓ ఎన్ జి వో నెల్లూరు పిలుపుమేరకు నో మాస్క్,నో సేల్,నో ఎంట్రీ, నో రైడ్ పై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. రూడ్స్ అధ్యక్షులు షేక్ రసూల్ అధ్యక్షతన జరిగిన పై కార్యక్రమమును నెల్లూరు సెట్నెల్ సీఈఓ పుల్లయ్య ప్రారంభించి మాట్లాడుతూ కోవిడ్19 మొదటి దశ, రెండవ దశను ఎదుర్కొని మూడవ దశలో ఉన్నామని, ప్రతిరోజు 200 లకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఈ దశను ఎదుర్కొనేందుకు నెల్లూరు జిఓ ఎన్జీవో పిలుపుమేరకు, ఈరోజు పీఎంపీ,రూడ్స్ సౌజన్యంతో  డైకస్ రోడ్ సెంటర్ నందు మాస్క్ లేని ప్రతి ఒక్కరికి మాస్కులు ఇవ్వడం జరిగిందని, అలాగే షాపులు వద్ద యజమానులు మాస్కులు ధరించాలని, కొనుగోలుకు వచ్చే ప్రతి కస్టమర్ మాస్కు ధరించాలి అని తెలియజేస్తూ, బైక్, ఆటో,బస్సులలో వెళ్లే ప్రయాణికులకు  మాస్కులు ధరించాలని కోరుతూ మాస్కులు అందజేయడం అయినది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిఓ ఎన్జీవో నోడల్ అధికారి డాక్టర్ ఎ.మహేందర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ మాట్లాడుతూ కోవిడ్19 నియంత్రణకు బ్రహ్మాస్త్రాలు మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం, వ్యాక్సినేషన్ ఈ 4 ఆయుధాలతో కరోనాను నియంత్రించవచ్చని, కానీ చాలామంది కేసులు తగ్గాయని, లాక్ డౌన్ ఎత్తి వేశారని నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తున్నారని, నిబంధనలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, వారంలో మూడు రోజులు సోమ, మంగళ, బుధ వారాలు నో మాస్క్, నో సేల్, నో ఎంట్రీ, నో రైడ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వ్యాపారస్తులు మాస్కు ధరించి, కొనుగోళ్లకు వచ్చిన కస్టమర్ మాస్క్ ధరిస్తేనే వస్తువులు అమ్మాలని, మాస్కు లేనివారికి వస్తువులు అమ్మ వద్దని, బస్సు,ఆటో బైకులపై వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరుతున్నామన్నారు.
 ఈ కార్యక్రమంలో కో.ఆర్డినేటర్ కె.వెంకటేస్వర్లు, అడ్వకేట్ రమాదేవి, విశ్రాంత ఏఎస్ఐ మహబూబ్ బాషా, పి.ఎం.పి అధ్యక్షులు వేణుగోపాల్, రూడ్స్ అధ్యక్షులు షేక్ రసూల్, జి. శేషయ్య,వసుంధర, సుభాన్, రాజేష్, మన్సూర్ నారాయణ నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts