YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

 సెమీస్ కు చేరిన పీవీ సింధు

 సెమీస్ కు చేరిన పీవీ సింధు

 సెమీస్ కు చేరిన పీవీ సింధు
టోక్యో, జూలై 30,
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచితో శుక్రవారం క్వార్టర్‌ఫైనల్‌లో తలపడిన పీవీ సింధు 21-13, 22-20 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌‌ని అలవోకగా చేజిక్కించుకున్న పీవీ సింధు.. రెండో సెట్‌లో మాత్రం శ్రమించాల్సి వచ్చింది. మొత్తంగా 56 నిమిషాల పాటు ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన సింధు పైచేయి సాధించింది.ఈ మ్యాచ్ ముందు వరకూ యమగూచిపై పీవీ సింధుకి 11-7తో మెరుగైన గెలుపోటముల రికార్డ్ ఉంది. కానీ.. యమగూచి స్థానిక క్రీడాకారిణి కావడంతో.. ఆమెపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇది ఓరకంగా పీవీ సింధుకి కలిసొచ్చిందనే చెప్పాలి. తొలి సెట్‌లో ఆరంభంలోనే చేతులెత్తేసిన యమగూచి.. రెండో సెట్‌లో అదీ మధ్యలో అనూహ్యంగా పుంజుకుని కాసేపు 15-15, 17-18, 20-20తో పీవీ సింధుకి చెమటలు పట్టించేసింది. ఇద్దరి మధ్య సుదీర్ఘ ర్యాలీలు నడిచాయి. కానీ.. ఒత్తిడిలో ఆడటాన్ని బాగా అలవాటు చేసుకున్న సింధు.. తెలివిగా పాయింట్లు రాబట్టేసింది.
దీపికా క్వార్టర్స్
టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధించేలా కనిపించిన ఆర్చర్ దీపికా కుమారి ప్రయాణం క్వార్టర్‌ ఫైనల్స్‌లో ముగిసింది. వరల్డ్ నెం.1 ర్యాంక్‌లో ఉన్న దీపికా కుమారి.. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో కొరియా ఆర్చర్ ఆన్ సేన్ చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. కెరీర్‌లో మూడో సారి ఒలింపిక్స్‌లో పోటీపడిన దీపికా కుమారికి మళ్లీ రిక్త హస్తమే ఎదురైంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ప్రీ‌క్వార్టర్‌ఫైనల్స్‌లో వెనుదిరిగిన దీపికా కుమారి.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.
హాకీ జట్టు విజయం
టోక్యో ఒలింపిక్స్‌ ఎనిమిదవ రోజులో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. లవ్లీనా సెమిస్ లో అడుగుపెట్టి పతకం ఖాయం చేసుకుంది. మరోవైపు తెలుగు తేజం పీవీ సింధు కూడా యమగుచి పైగెలిచి సెమీస్ లో అడుగు పెట్టింది. ఇక భారత మెన్స్ హాకీ జట్టు జపాన్ పై 5-3 తేడాతో గెలిచింది.
మరో పతాకం ఖరారు చేసిన లవ్లీనా
టోక్యో ఒలింపిక్స్‌లోకి భారత్‌కి మరో పతకం దక్కనుంది. మహిళల 69 కేజీల బాక్సింగ్ విభాగంలో పోటీపడిన లవ్లీనా శుక్రవారం క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ చిన్ చెన్‌ని ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దాంతో.. భారత్‌కి పతకం ఖాయమైంది. ఇప్పటికే వెయిట్‌లిప్టింగ్‌లో మీరాబాయి చాను భారత్‌కి రజత పతకం అందించిన విషయం తెలిసిందే. క్వార్టర్స్‌లో చిన్ చెన్‌పై 4-1 తేడాతో లవ్లీనా విజయం సాధించింది.అస్సాంకి చెందిన 23 ఏళ్ల లవ్లీనా.. ఫస్ట్ రౌండ్‌‌లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించి 3-2తో గెలిచింది. అనంతరం సెకండ్ రౌండ్‌లోనూ అదే దూకుడు కొనసాగించిన లవ్లీనా.. డిఫెన్స్‌లోనూ అత్యుత్తమంగా రాణించింది. దాంతో.. రెండో రౌండ్ కూడా 3-2తో లవ్లీనా సొంతమైంది. ఇక ఆఖరి రౌండ్‌లో చిన్ చెన్‌ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోగా.. వరుస పంచ్‌లు గుప్పించి లవ్లీనా.. ఆఖరిగా 4-1తో సెమీస్‌లోకి అడుగుపెట్టింది.ఒలింపిక్స్‌లో భారత్‌కి చెందిన ఇద్దరు బాక్సర్లు మాత్రమే ఇప్పటి వరకూ పతకాలు సాధించారు. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ కాంస్య పతకాలు భారత్‌కి అందించారు. లవ్లీనాకి ప్రస్తుతం కనీసం కాంస్యం ఖాయమవగా.. ఆమె బంగారం లేదా రజతం గెలిచే అవకాశాలు లేకపోలేదు.
కరోనా జయించి... అలా... ఎదిగిన లవ్లీ
ఇండియాకు మ‌రో ఈశాన్య భార‌తీయురాలు ఒలింపిక్స్‌లో మెడ‌ల్ ఖాయం చేసింది. తొలిరోజే మ‌ణిపూర్ వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చాను సిల్వ‌ర్‌తో మెర‌వ‌గా.. ఇప్పుడు అస్సాంకు చెందిన బాక్స‌ర్ ల‌వ్లీనా బోర్గోహైన్‌ ( Lovlina ).. క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో గెల‌వ‌డంతో ఇండియాకు క‌నీసం మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ అయితే క‌చ్చితంగా రానుంది. బాక్సింగ్ సెమీఫైన‌ల్లో ఓడిపోయినా బ్రాంజ్ మెడ‌ల్ వ‌స్తుంది.ఒలింపిక్స్ ప్రారంభ‌మ‌య్యే ముందు మ‌న‌కు మెడ‌ల్ తెచ్చే బాక్స‌ర్ల లిస్ట్‌లో మేరీకోమ్‌, అమిత్ పంగాల్‌, వికాస్ కృష్ణ‌ణ్‌లాంటి వాళ్ల పేర్లు వినిపించినా.. లవ్లీనా పేరు మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. ఎంతో మంది అథ్లెట్ల‌లాగే ఇలా వ‌చ్చి అలా వెళ్లే జాబితాలో ఆమెనూ ఊహించుకున్నారు. కానీ రౌండ్ ఆఫ్ 32లో బై ల‌భించి.. రౌండ్ ఆఫ్ 16లో జ‌ర్మనీ బాక్స‌ర్ న‌దైన్ అపెట్జ్‌పై గెల‌వ‌డంతో ఆమె పేరు ఒక్క‌సారిగా మార్మోగింది. మ‌రొక్క బౌట్ గెలిస్తే చాలు.. మెడ‌ల్ ఖాయ‌మ‌ని భావిస్తున్న వేళ ఆమె దానిని చేసి చూపించింది. వ‌చ్చే నెల 4న జ‌రిగే సెమీస్‌లో టాప్ సీడ్, ట‌ర్కీకి చెందిన బాక్స‌ర్ బుసేనాజ్ సూర్మెనెలితో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టివర‌కూ ఒలింపిక్స్‌లో ఇండియా త‌ర‌ఫున మేరీకోమ్‌, విజేంద‌ర్ సింగ్ మాత్ర‌మే బాక్సింగ్ మెడ‌ల్స్ గెలిచారుఅస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చింది ల‌వ్లీనా బోర్గోహైన్‌. ఆమె తండ్రి ఓ చిన్న వ్యాపారి. త‌ల్లి హోమ్ మేక‌ర్‌. ల‌వ్లీనాకు ఇద్ద‌రు తోబుట్టువులు ఉన్నారు. వాళ్లిద్ద‌రూ జాతీయ స్థాయి మార్ష‌ల్ ఆర్టిస్టులు. తాను కూడా వాళ్లిద్ద‌రినీ చూసి 13 ఏళ్ల వ‌య‌సులోనే ముయ్ థాయ్ నేర్చుకుంది. అయితే దీనిని ఒలింపిక్ క్రీడ‌గా గుర్తించ‌బోర‌ని తెలిసిన త‌ర్వాత ఆమె త‌న మ‌న‌సు మార్చుకుంది. ల‌వ్లీనా నిజానికి కిక్ బాక్సింగ్‌తో కెరీర్ మొదలుపెట్టినా.. త‌ర్వాత బాక్సింగ్ వైపు మ‌ళ్లింది. 2017లో జ‌రిగిన ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్‌లో బ్రాంజ్‌మెడ‌ల్‌తో ల‌వ్లీనా తెర‌పైకి వ‌చ్చింది. గ‌తేడాది మార్చిలో ఏషియా, ఓషియానియా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫికేష‌న్ టోర్నీలో గెలిచి ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించింది.ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించాన‌న్న ఆనందం ఆమెకు ఎంతోసేపు నిల‌వ‌లేదు. ఆ వెంటే ల‌వ్లీనా కొవిడ్ బారిన ప‌డింది. దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్‌) 52 రోజుల అత్యుత్త‌మ శిక్ష‌ణ కోసం యూర‌ప్ పంపిన 16 మంది బాక్స‌ర్ల లిస్ట్‌లో ఆమె స్థానం కోల్పోయింది. కొవిడ్ సోకిన‌ప్పుడు త‌న శ‌రీరం చాలా బ‌ల‌హీనంగా అయిపోయింద‌ని, అస‌లు ప్రాక్టీస్ చేయ‌లేక‌పోయానని ల‌వ్లీనా చెప్పింది. అయితే ధ్యానం చేయ‌డం త‌న‌కు బాగా స‌హ‌క‌రించింద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె తెలిపింది. అస్సాం నుంచి ఇండియాకు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తొలి మ‌హిళా అథ్లెట్ లవ్లీనానే.
లవ్లీనా కెరీర్ ఘ‌న‌త‌లు
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌: 2018లో వాల్ట‌ర్‌వెయిట్‌లో బ్రాంజ్‌మెడ‌ల్‌, 2019లోనూ ఇదే కేట‌గిరీలో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచింది.
ఏషియ‌న్ చాంపియ‌న్‌షిప్స్‌: 2017లో వాల్ట‌ర్‌వెయిట్‌లో బ్రాంజ్ మెడ‌ల్‌, 2021లో దుబాయ్‌లో ఇదే కేట‌గిరీలో పాల్గొని మరో బ్రాంజ్ గెలిచింది.

Related Posts