YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

త్వ‌ర‌లో `ఆహా` నుంచి మ‌రో స‌రికొత్త ఒరిజిన‌ల్‌.. `త‌ర‌గ‌తి గ‌ది దాటి`

త్వ‌ర‌లో `ఆహా` నుంచి మ‌రో స‌రికొత్త ఒరిజిన‌ల్‌.. `త‌ర‌గ‌తి గ‌ది దాటి`

త్వ‌ర‌లో `ఆహా` నుంచి మ‌రో స‌రికొత్త ఒరిజిన‌ల్‌.. `త‌ర‌గ‌తి గ‌ది దాటి`

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ `ఆహా`.. తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు స‌రికొత్త నిర్వ‌చ‌నాన్ని చెబుతూ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌, పాత్ బ్రేకింగ్ వెబ్ సిరీస్‌లు, షోస్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఈ క్ర‌మంలో `త‌ర‌గ‌తి గ‌ది దాటి` అనే స‌రికొత్త వెబ్ సిరీస్‌ను చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది `ఆహా`. సెంట‌ర్ ఫ్రెష్ స‌మ‌ర్ప‌ణ‌లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ టి.వి.ఎఫ్ ఒరిజిన‌ల్ `ఫ్లేమ్స్‌`కు రీమేక్‌. టీనేజ్ రొమాన్స్ గురించి తెలియ‌జేసే వెబ్ సిరీస్ ఇది. `పెళ్లిగోల` అనే పాపుల‌ర్ వెబ్ సిరీస్ చేసిన ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ `త‌ర‌గ‌తి గ‌ది దాటి` సిరీస్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. హ‌ర్షిత్ రెడ్డి, పాయ‌ల్ రాధాకృష్ణ‌, నిఖిల్ దేవాదుల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇది చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇందులో ఇద్ద‌రు కుర్రాళ్లు చాటింగ్ చేసుకుంటున్నారు.
`త‌ర‌గ‌తి గ‌ది దాటి` రాజ‌మండ్రిలో జ‌రిగే క‌థ‌. తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు దీన్ని రూపొందిస్తున్నారు. గోదావ‌రి, దాని చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లోని జీవనాన్ని తెలియ‌జేస్తుంది. కృష్ణ అలియాస్ కిట్టు అనే యువ‌కుడు చుట్టూ తిరిగే క‌థ‌. కిట్టు త‌ల్లిదండ్రులైన శంక‌ర్‌, గౌరి ఓ కోచింగ్ సెంట‌ర్‌ను న‌డుపుతుంటారు. కృష్ణ‌కు లెక్క‌లంటే చాలా ఇష్టం. విద్యార్థిగా మంచి తెలివితేటలుంటాయి. కానీ చ‌దువుపై దృష్టి పెట్ట‌డు. వాళ్ల కోచింగ్ సెంట‌ర్‌లో జాస్మిన్ అనే అమ్మాయి జాయిన్ అయిన త‌ర్వాత అత‌ని ప్రపంచం ఎలాంటి మలుపులు తిరుగుతుంద‌నేదే క‌థ‌.
ఐదు ఎపిసోడ్స్ ఉండే ఈ సుదీర్ఘ‌మైన వెబ్ సిరీస్‌లో కృష్ణ‌, జాస్మిన్ మ‌ధ్య ప్రేమ‌..టీనేజ్ గంద‌ర‌గోళాలెలా ఉంటాయ‌నే వీక్ష‌కులు చూడొచ్చు. ఈ ఏడాది విడుద‌లైన `మెయిల్` న‌టించి మెప్పించిన హ‌ర్షిత్ రెడ్డి త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. `భిన్న‌, సింగ‌పెన్నె` వంటి కన్న‌డ‌, త‌మిళ వెబ్ సిరీస్‌ల్లో న‌టించిన పాయ‌ల్ రాధాకృష్ణ‌న్ న‌టిగా త‌నెంటో ప్రూవ్ చేసుకుంది. `ఉయ్యాల జంపాల‌, బాహుబ‌లి` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన నిఖిల్ దేవాదుల ప‌రిణితి గ‌ల న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నాడు.
టి.వి.ఎఫ్ ఒరిజిన‌ల్ ప‌ర్మ‌నెంట్ రూమ్‌మేట్స్ ఆధారంగా చేసుకుని మ‌న నెటివిటీకి త‌గిన‌ట్లు మార్చి చేసిన ఒరిజిన‌ల్ క‌మిట్‌మెంట‌ల్‌. ఇందులో ఉద్భ‌వ్ ర‌ఘునంద‌న్‌, పున‌ర్న‌వి భూపాలం ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. `క‌మిట్ మెంటల్‌` త‌ర్వాత ఆహా ఇప్పుడు టి.వి.ఎఫ్ నుంచి ఫ్లేమ్స్‌ను `త‌ర‌గ‌తి గ‌ది దాటి`గా రీమేక్ చేస్తుంది. ప్రేక్ష‌కుల‌ను ఊహ‌ల‌కు అంద‌కుండా థ్రిల్ చేసిన సై ఫై క్రైమ్ థ్రిల్ల‌ర్ కుడి ఎడ‌మైతే రీసెంట్‌గా ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. ప‌వ‌న్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ట్విస్టులు, ట‌ర్నులు.. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్‌, ర‌వి ప్ర‌కాశ్ వంటి న‌టీన‌టుల అద్భుతమైన‌ పెర్ఫామెన్స్ ప్రేక్షకుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. ఈ ఏడాది `క్రాక్‌, నాంది, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబి రెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` వంటి చిత్రాలు, ఒరిజ‌న‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది `ఆహా`.

Related Posts