
బెంగళూరు, జూలై 21,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు'చిత్రం మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం చేయడం మొదలు పెట్టేశారు. థియేటర్స్ బయట కటౌట్స్, బ్యానర్స్, బ్యాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటివి సినిమా విడుదల రోజు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం నాలుగు రోజుల ముందే మొదలు పెట్టేశారు. ఎంతైనా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. అభిమానుల్లో ఆ మాత్రం ఆకలి ఉండడం సహజమే. బెంగళూరు లో ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు సంధ్య థియేటర్ వద్ద చేసిన హంగామాకు సమందించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 కటౌట్స్ ని థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు.అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కి సంబందించిన కటౌట్ ని కూడా లాంచ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అకిరా నందన్ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాడు. ఒకప్పుడు కెమెరా ముందుకు రావడానికే భయపడే అకిరా నందన్, ఇప్పుడు తన తండ్రితో కలిసి జాలీగా తిరుగేస్తున్నాడు. ఆయనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలలో ఒకటి ఎంచుకొని ఈ కటౌట్ ని లాంచ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి. అదే విధంగా విజయవాడ లో కూడా అభిమానులు కటౌట్ ని లాంచ్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కటౌట్ లాంచ్ ఈవెంట్ కి అంత మంది అభిమానులు రావడం ఏంటి బాబోయ్ అని ఆశ్చర్యపోయారు.ఇప్పుడే ఇలా ఉందంటే ఇక విడుదల రోజు ఎలా ఉంటుందో. పైగా పైడ్ ప్రీమియర్ షోస్ కూడా ఉన్నాయి. రాబోయే రోజులు మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా ఆన్లైన్ లో ఆఫ్ లైన్ లో నాన్ స్టాప్ గా చూడబోతున్నాం అన్నమాట. ఆరేళ్ళ తర్వాత వస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై మామూలు ఆడియన్స్ లో కావాల్సినంత హైప్ జనరేట్ అవ్వలేదు అనేది వాస్తవం. కానీ రేపు హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఒక రేంజ్ లో హైప్ ని జనరల్ ఆడియన్స్ లో క్రియేట్ చేస్తుందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరమే లేదని అంటున్నారు. అంతే కాదు మూవీ టీం తరుపున రేపు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నాడట.