YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సాయుధ దళ సిబ్బందికి శిక్షణ తరగతులు

సాయుధ దళ సిబ్బందికి శిక్షణ తరగతులు

సాయుధ దళ సిబ్బందికి శిక్షణ తరగతులు
మచిలీపట్నం
పోలీస్ అంటే ప్రజల్లో కనిపించే కరుకుదనం మాత్రమే కాదు, సమస్య తలెత్తితే నిలువరించే సమయస్ఫూర్తి, ఆపత్కాలంలో రక్షించే సేవాతత్పరులు అనే ఒక నమ్మకం ఉంది. అలాంటి పోలీస్ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలంటే నిరంతర శిక్షణ అవసరమని జిల్లా ఎస్పీ  సిద్ధార్థ్ కౌశల్ అన్నారు.
శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు సహాయకారిగా ఉండే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి నేటి నుండి శిక్షణా తరగతులు ప్రారంభించి, మచిలీపట్నం ఏఆర్ పెరేడ్ గ్రౌండ్ లో  కవాతు, ఆయుధాలు పరిశీలన, వాటి పనితీరు ఉపయోగించే విధానం, మొదలైన వాటిపై శిక్షణ అందిస్తున్నారు. వీటివలన సిబ్బందిలో క్రమశిక్షణ భరితమైన విధి నిర్వహణ అలవరుచుకొని, నిరంతర కవాతు వలన ఆరోగ్యంగా ఉండటమే కాక, శారీరిక సమస్యలు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని, నిరంతర నేర్చుకోవడం వలన వీరి యొక్క సామర్థ్యం మరింత మెరుగు పడుతుందని, మానసికోల్లాసం పెంపొందుతుందని ఎస్పీ తెలియజేశారు

Related Posts