YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

స్కూళ్లు నడిచేదెట్లా...

స్కూళ్లు నడిచేదెట్లా...

కడప, ఆగస్టు 4, 
నూతన విద్యావిధానంపై ఉపాధ్యాయ సంఘాలతోనూ, తల్లితండ్రులతోనూ చర్చిస్తాం. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఇది! ఆచరణలో జరుగుతున్నది మాత్రం వేరు. చర్చలు, అభిప్రాయ సేకరణలు ఏవీ లేకుండా ప్రాధమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులన హైస్కూళ్లకు తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆగస్టు 16లోగా ఈ ప్రక్రియ పూర్తికావాలంటూ డెడ్‌లైన్‌ కూడా విధించింది. దీంతో ఎక్కడికక్కడ ఉన్నతాధికారుల నుండి హెడ్‌మాస్టర్లపై ఒత్తిడి ప్రారంభమైంది. ఇటీవల జరిగిన సమీక్షలో 250 మీటర్ల పరిధిలోపు ఉన్న హైస్కూళ్లకే తరలిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ దానిని కూడా పట్టించుకోవద్దని హెడ్‌మాస్టర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. 'ముందు తరలించేయండి.. మిగిలినవనీ తరువాత చూద్దాం' అని ఆదేశిస్తున్నారని తెలిసింది. హెడ్‌మాస్టర్లతో కొన్ని జిల్లాల్లో సమావేశాలు జరిపి ఆదేశాలు ఇస్తుంటే మరికొన్ని చోట్ల అటువంటి సమావేశాలేమి లేకుండానే ఫోన్ల ద్వారా ఆదేశాలు ఇస్తున్నారు.కడపలో ఇలా....కడప జిల్లా రైల్వే కొడూరు మండలంలో ఓబనపల్లి, ఓబనపల్లి(ఎడబ్ల్యు)లో రెండు ప్రాథమిక పాఠశాలలు బయ్యన్నపల్లి ఉన్నత పాఠశాలకు 400 మీటర్ల దూరంలో ఉన్నాయి. తరగతులు తరలించొద్దని స్థానిక ఎమ్మెల్యేను ఆ పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రులు కోరగా ఆయన డిఇఓతో మాట్లాడుతానన్నారు. 250 మీటర్ల కంటే దూరం ఉన్న పాఠశాలల తరలింపుపై ఎంఇవోల ద్వారా అభ్యంతరాలు చెప్పాలని జిల్లా అధికారులు ఉపాధ్యాయులకు చెబుతున్నారు. కాని, పైస్థాయి అధికారుల భయంతో ఎంఇవోలు వాటిని సరిగా నమోదు చేయడంలేదు.గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలకు సుమారు 900 మీటర్ల దూరంలో ఉంది. అయినా అధికారులు దీనిని మ్యాపింగ్‌ లిస్ట్‌లో పెట్టారు. ఉపాధ్యాయులు అభ్యంతరం తెలుపగా వచ్చే విద్యాసంవత్సరం 500 మీటర్ల పైబడిన పాఠశాలల్లో కూడా తరగతుల తరలింపు ఉంటుందని, కాబట్టి ఈ ఏడాదే మ్యాపింగ్‌ చేయాలని డిఇఓ ఆదేశించినట్లు తెలిసింది. మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. తరలించే విధానాన్ని తల్లిదండ్రుల చేత ఒప్పించాలని, వారు అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోవద్దని చెబుతున్నట్టు సమాచారం. పాఠశాలలు తెరిచే రోజు ఆగస్టు 16నాటికి తరలించే ప్రక్రియ మొత్తం పూర్తికావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా వుండగా నూతన జాతీయ విద్యావిధానం-2020 రాష్ట్రంలో అమలు చేసే అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు.

Related Posts