YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

 రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్పు

 రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్పు

 రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్పు
న్యూఢిల్లీ ఆగష్టు 6
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క్రీడ‌ల్లో అత్యున్న‌త పుర‌స్కారం అయిన రాజీవ్ ఖేల్‌ర‌త్న పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్చారు. ఈ అవార్డు పేరును మార్చాల‌ని త‌న‌కు దేశ‌వ్యాప్తంగా పౌరుల నుంచి అనేక విన‌తులు అందాయ‌ని ఈ సంద‌ర్భంగా మోదీ ట్విట‌ర్‌లో వెల్ల‌డించారు. వాళ్ల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక నుంచి ఖేల్‌ర‌త్న అవార్డు పేరును మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జ‌యంతి అయిన ఆగ‌స్ట్ 29ని ఇప్ప‌టికే జాతీయ క్రీడా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

Related Posts