YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

నీరజ్ చోప్రా కోసం 8 కోట్ల ఖర్చు

నీరజ్ చోప్రా కోసం 8 కోట్ల ఖర్చు

నీరజ్ కోసం 8 కోట్ల ఖర్చు
ముంబై, ఆగస్టు 9, 
టోక్యో ఒలింపిక్స్‌లో శతాబ్దాల భారతీయుల కలను యువకుడు నీరజ్ చోప్రా నెరవేర్చాడు. 130 కోట్ల భారతీయుల 125 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన వీరుడు నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం.. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్రా 450 రోజుల పాటు జావెలిన్‌ త్రో కోసం విదేశాల్లో శిక్షణ పొందాడు. ఈ శిక్షణ కోసం కేంద్ర సర్కార్‌ 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చోప్రా ప్రస్తుత ఒలింపిక్స్ కోసం 26 పోటీలలో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికా, పోలాండ్, టర్కీ, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్ స్వీడన్‌ వంటి దేశాల్లో విదేశీ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాడు.తొలుత 2017లో నీరజ్‌ చోప్రా కోచ్‌గా జావెలిన్ త్రో లెజెండ్ ఉవే హోన్ బాధ్యతలు స్వీకరించగా.. 2019లో చోప్రా మోచేతి శస్త్రచికిత్స తర్వాత ఆయన కోచ్గా డా. క్లాస్ బార్టోనియెడ్జ్ ఎంపికయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1.22కోట్లు చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావలిన్లకు రూ. 4,35,000 ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు నీరజ్ యూరప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 50 రోజులపాటు స్వీడన్‌లో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ .19.22 లక్షలు ఖర్చు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా దేశానికి స్వర్ణపతకం అందించి వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు నీరజ్‌ చోప్రా. మెరుగైన క్రీడాకారుడిగా రాటుదేలేందుకు కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలువడంతో అందుకు ప్రతిఫలంగా నీరజ్‌ దేశ మువ్వన్నెల జెండాను విశ్వక్రీడల్లో రెపరెపలాఆడించాడు. నీరజ్‌ చోప్రాకు ముందు అభినవ్‌ బింద్రా షూటింగ్‌ విభాగంలో 2008 బీజివగ్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. ఈ క్రీడల్లో భారత్‌ 7 పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం కాగా, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో భారత్‌ 48వ స్థానంలో నిలిచింది.

Related Posts