YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

హెడ్ కోచ్ గా రాహుల్

హెడ్ కోచ్ గా రాహుల్

ముంబై, ఆగస్టు 11, 
టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని తొలగించే ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ. ఆయన స్థానంలో హెడ్ కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి కోచ్‌గా పనిచేస్తున్నప్పటి నుంచి భారత్ అనేక విదేశీ సిరీస్‌లలో విజయం సాధించింది. అయితే  ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటలేకపోయింది. ఇక రవిశాస్త్రి పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో ఇకపై శాస్త్రికి కాకుండా కోచ్ పదవిని ద్రవిడ్‌కు అప్పగించాలని  బీసీసీఐ  ఆలోచిస్తున్నట్లు సమాచారం.మరోవైపు ద్రవిడ్ ఆధ్వర్యంలో భారత అండర్ 19 క్రికెట్ జట్లు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో సత్తా చాటాయి. 2016 జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత జట్టు రన్నరప్‌ గా నిలవగా, 2018లో ఏకంగా విజేతగా నిలిచింది. దీంతో ద్రవిడ్ 2019 జూలై 8 నుంచి బెంగళూరులోని ఎన్సీయేకు హెడ్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఆ పదవీ కాలం రెండేళ్లు. ఇప్పటికే ముగిసింది. దీంతో ఎన్సీయేకు హెడ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే మరోసారి  ఎన్సీయే హెడ్‌గా పనిచేయాలంటే ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాలి. కానీ అలా జరగకపోవచ్చని తెలుస్తోంది. ఇటీవల శ్రీలంక వెళ్లిన టీమిండియా జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
ఒలింపిక్స్ లో క్రికెట్
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని ఎన్నాళ్ల నుంచో డిమాండ్లు వస్తున్నాయి. విశ్వక్రీడల్లో క్రికెట్ ఉంటే బాగుంటుందని, మన జట్టు ఆడితే మెడల్ ఖాయమని భారత క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ కానీ ఎలాంటి కామెంట్లు చేయలేదు కానీ ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాల్సిందిగా ఒలింపిక్స్ కమిటీకి ఐసీసీ ప్రతిపాదనలు పంపనుంది. బిడ్ తయారీకి ఓ ప్రత్యేక ప్యానెల్ ను ఐసీసీ నియమించింది.కాగా, ఇప్పటికే వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా క్రికెట్‌ను కూడా భాగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో 2028 ఒలింపిక్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని, విశ్వ క్రీడల్లోకి కూడా దీనిని తీసుకుని వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఐసీసీ తెలిపింది.

Related Posts